Moviesమోక్షజ్ఞ రేంజ్ మామూలుగా లేదుగా..ఆ పాన్ ఇండియా స్టార్ సినిమాతోనే ఎంట్రీ..బాలయ్య...

మోక్షజ్ఞ రేంజ్ మామూలుగా లేదుగా..ఆ పాన్ ఇండియా స్టార్ సినిమాతోనే ఎంట్రీ..బాలయ్య సంచలన నిర్ణయం..?!

ప్రజెంట్ నందమూరి అభిమానులు వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తున్న సినిమా మోక్షజ్ఞ ఎంట్రీ. ఇదిగో ఎంట్రీ.. అదిగో ఎంట్రీ అంటున్నారు తప్పిస్తే .. ఎక్కడా కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కి సంబంధించి అఫీషియల్ స్టేట్మెంట్ గాని ..న్యూస్ కానీ బయటకు రావడం లేదు. బాలయ్య ఫ్యాన్స్ మోక్షజ్ఞ రాక కోసం చాలా చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ప్రెసెంట్ బాలయ్య ఎన్నికల హడావిడిలో బిజీగా ఉన్నారు. తాను కమిట్ అయిన బాబి సినిమాను సైతం కొన్ని రోజులపాటు పక్కన పెట్టేసాడు.

ఈ క్రమంలోనే బాలయ్య గెలిచి పదవి చేపడితే ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరం కావాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు కనీసం బాలయ్య కొడుకుగా మోక్షజ్ఞ సినిమాలో చేస్తూ ఉన్నా కూడా ఫాన్స్ కి ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది . అందుకే మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . గత ఐదేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీ పై వార్తలు వస్తున్నాయి .

అవన్నీ పుకార్లు గానే మిగిలిపోయాయి. రీసెంట్గా సోషల్ మీడియాలో మోక్షజ్ఞ కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుందట . అంతేకాదు అల్లు అర్జున్ కోసం రాసుకున్న కథను మోక్షజ్ఞ కోసం బోయపాటి కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నారట . ఇది ఫుల్ టు ఫుల్ మాస్ ఎంటర్టైన్మెంట్ గా తెలుస్తుంది. బాలకృష్ణకి సమరసింహారెడ్డి ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో అదే విధంగా మోక్షజ్ఞ కి ఈ సినిమా అలాంటిది ఇవ్వబోతుంది అంటున్నారు జనాలు . ఏపీ ఎన్నికల హడావిడి ముగిశాక మోక్షజ్ఞ బోయపాటి శ్రీను మూవీ సెట్స్ పైకి వెళ్లబోతుంది అంటూ ఫిలిం ఇండస్ట్రీలో న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news