Moviesఎన్టీఆర్ తర్వాత కొరటాల డైరెక్ట్ చేయబోయే హీరో ఎవరో తెలుసా.. కలలో...

ఎన్టీఆర్ తర్వాత కొరటాల డైరెక్ట్ చేయబోయే హీరో ఎవరో తెలుసా.. కలలో కూడా ఊహించిన స్టార్..!

ప్రజెంట్ ఇండస్ట్రీలో డైరెక్టర్ చాలా తెలివితేటలతో ముందుకు వెళ్తున్నారు. ఒక స్టార్ హీరో తో సినిమాకు కమిట్ అయిన వెంటనే ఆ సినిమా సెట్స్ పై ఉండగానే మరొక స్టార్ హీరోతో మూవీ కమిట్ అయిపోతున్నారు . ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ డైరెక్టర్స్ ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు . రీసెంట్ గా కొరటాల శివ సైతం అదే స్ట్రాటజీని ముందుకు తీసుకెళ్తున్నాడు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కొరటాల శివ.. ప్రజెంట్ తారక్ తో దేవర అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు .

ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . శ్రీకాంత్ కీలకపాత్రలో కనిపించబోతున్నాడు . ఈ సినిమా కూడా రెండు భాగాలుగా తెరకెక్కబోతుంది. అయితే ఎన్టీఆర్ తో సినిమా అయిపోగానే కొరటాల శివ నెక్స్ట్ ఏ హీరోతో మూవీకి కమిట్ అయ్యాడు అన్న విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . అందుతున్న సమాచారం ప్రకారం…
కొరటాల శివ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేదా అల్లు అర్జున్ లతో తెరకెక్కించబోతున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.

ప్రభాస్ – కొరటాల కాంబో గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన మిర్చి సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వీళ్ళ కాంబోలో ఒక సినిమా రావాలి అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ కి కూడా కొరటాల అంటే మహా ఇష్టం… అందుకే వీళ్ళ కాంబోలో ఒక సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . అదేవిధంగా అల్లు అర్జున్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కొరటాల శివ డైరెక్షన్లో నటించాలి అని అనుకుంటున్నాను అంటూ ఓపెన్ గానే చెప్పుకు వచ్చాడు . దీంతో వీళ్ళకాంబోలో కూడా సినిమా వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లు ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు . మొత్తానికి కొరటాల పాన్ ఇండియా స్టార్ తోనే తన నెక్స్ట్ సినిమాను తెరకెక్కించబోతున్నాడన్నమాట..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news