Movies"ఉప్పెన సినిమాని రిజెక్ట్ చేసింది నేనే"..షాకింగ్ మ్యాటర్ ని బయటపెట్టిన స్టార్...

“ఉప్పెన సినిమాని రిజెక్ట్ చేసింది నేనే”..షాకింగ్ మ్యాటర్ ని బయటపెట్టిన స్టార్ హీరో కూతురు..!

సినిమా ఇండస్ట్రీలో స్టార్ అవ్వాలంటే ఒక్క సినిమా చాలు . అప్పటివరకు మనం పడిన కష్టాలు ఏడుపులు బాధ అన్ని కూడా తుడిచిపెట్టుకుపోతుంది . అలాంటి ఒకే ఒక్క సినిమా ఉప్పెన. ఈ సినిమా ద్వారా కృతి శెట్టి కెరియర్ ఎలాంటి టాప్ స్థానానికి చేరుకుందో మనకు తెలిసిందే. అంతకుముందు చిన్నాచితక అరాకొరా యాడ్స్ లో నటిస్తూ జనాలకు దగ్గరైన కృతి శెట్టి .. ఉప్పెన సినిమా ద్వారా స్టార్ హీరోయిన్గా మారి చిరంజీవి చేతనే ప్రశంసలు దక్కించుకునే అంత రేంజ్ కి ఎదిగిపోయింది .

ఈ సినిమా పుణ్యమా అంటూ ఇప్పుడు తమిళ్లో కూడా ఆమె స్టార్ హీరోయిన్గా మారిపోయింది . కృతి శెట్టి కి ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్ ఇచ్చిందో మనకు తెలిసిందే. వైష్ణవ్ వైష్ణవ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. పెట్టిన దానికి మూడు రెట్లు లాభాలు తీసుకొచ్చి మేకర్స్ కి లాభాల వర్షం కురిపించింది. అయితే నిజానికి ఈ సినిమాలో హీరోయిన్ గా యాంగ్రీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న రాజశేఖర్ కూతురు శివాని రాజశేఖర్ ని అనుకున్నారట మేకర్స్ .

కానీ ఆమె ఈ పాత్రను రిజెక్ట్ చేసిందట . ముద్దు సన్నివేశాల్లో నటించాల్సి వచ్చినందుకు ఈ సినిమాను ఆమె రిజెక్ట్ చేసిందట. ఈ విషయాన్ని ఓపెన్ గా ఆమె చెప్పుకొచ్చింది. దీంతో ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. ఒకవేళ ఈ పాత్రను చేసి ఉంటే ఇప్పుడు స్టార్ హీరోయిన్గా రాజ్యమేలేసి ఉండేది అని చెప్పడంలో సందేహం లేదు. పాపం మంచి ఛాన్స్ మిస్ చేసుకునింది రాజశేఖర్ డాటర్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news