Moviesమృణాల్ ఠాకూర్ లో ఉన్నది ..పూజా హెగ్డే లో లేనిది అదే...

మృణాల్ ఠాకూర్ లో ఉన్నది ..పూజా హెగ్డే లో లేనిది అదే ..అందుకే కెరియర్ ఇలా తగలాడిందా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక జనాలలో ఓపిక – సహనం పూర్తిగా నశించేస్తున్నాయి . ఉన్న విషయం ఉన్నట్టు మాట్లాడడం ఒక విధంగా మంచిదే . అయితే మరొక విధంగా చెప్పాలి అంటే ఎదుట వాళ్ళను హర్ట్ చేసే విధంగా మాట్లాడుతున్నారు. సామాన్య జనాలు కూడా సినీ స్టార్స్ పై రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో పూజ హెగ్డే కి సంబంధించి ఎలాంటి ట్రోలింగ్ జరుగుతుందో మనం చూస్తున్నాం .

ఆమె నటించిన సినిమాలో వరుసగా ఫ్లాప్ అవడంతో పూజ హెగ్డే కు దారుణాతి దారుణమైన పరిస్థితి నెలకొంది . పక్కన పోతున్న సరే పట్టించుకునే నాధుడే లేకుండా పోయింది. అయితే పూజా హెగ్డే గతంలో మిస్ చేసుకున్న ఆఫర్ గురించి మరోసారి వార్తలు వైరల్ అవుతున్నాయి . సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయిన మృణాల్ ఠాకూర్ ప్లేస్ లో ముందుగా హను రాఘవపూడి పూజ హెగ్డే అని అనుకున్నారట .

ఆమె అప్పట్లో రాధే శ్యామ్ సినిమా షూట్లో బిజీగా ఉండడంతో ఈ సినిమాకు కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేను అంటూ రిజెక్ట్ చేసిందట . అయితే రాధేశాం సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . మృణాల్ ఠాకూర్ నటించిన సీతారామం సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక్కడే పూజాకు భారీ బొక్క పడింది. ఆమెకు కోరి వచ్చిన అదృష్టాన్ని ఆమె చేతులారా నాశనం చేసుకున్నట్లయింది. మరోసారి పూజను ట్రోల్ చేస్తున్నారు జనాలు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వాలి అంటే అందం – టాలెంట్ ఉంటే సరిపోదు అని.. మేనేజింగ్ స్కిల్స్ కూడా ఉండాలి అని .. పూజా హెగ్డే లో అవి లేవని మృణాల్ ఠాకూర్ కు అది పుష్కలంగా ఉన్నాయి అని .. అందుకే ఆమె స్టార్ హీరోయిన్గా మారిపోయి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుంది అని చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news