Moviesఓరి దేవుడోయ్.. క్లిం కార కేర్ టేకర్ నెల జీతం ఏంతో...

ఓరి దేవుడోయ్.. క్లిం కార కేర్ టేకర్ నెల జీతం ఏంతో తెలుసా..? సాఫ్ట్ వేర్ ఉద్యోగి కూడా వేస్ట్..!!

క్లిం కార.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు పుట్టిన బిడ్డ . పెళ్లయిన దాదాపు పదేళ్ల తర్వాత వీళ్లకు మొదటి సంతానం జన్మించింది. ఈ ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాని అంటాయి. మెగా ఫ్యామిలీలోకి క్లింకార వచ్చిన తర్వాత ఎన్ని గుడ్ న్యూస్ లు విన్నామో మనకు తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఏకంగా మెగా ఫ్యామిలీలో జరిగే శుభకార్యాలు అన్నిటికి కారణం అంటూ ప్రకటించేసాడు .

మెగా ఫ్యామిలీ మొత్తం క్లింకారను అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు . రీసెంట్ గా క్లిం కారకు సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. క్లిం కార కోసం రామ్ చరణ్ – ఉపాసన ఒక కేర్ టేకర్ ని పెట్టుకున్నారు. చరణ్ సినిమాల షూటింగ్లో బిజీగా ఉండడం .. ఉపాసన అపోలో హాస్పిటల్స్ బాధ్యతలను చూసుకోవడంలో బిజీ అయినప్పుడు.. ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు ..క్లిం కారాను జాగ్రత్తగా చూసుకోవడానికి కేర్ టేకర్ నియమించుకున్నారట.

అంతేకాదు ఆమె పేరు సావిత్రి.. ఎంతోమంది సినీ సెలబ్రిటీల పిల్లలకు కేర్ టేకర్ గా వర్క్ చేసిందట . బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ కుమారుడికి కూడా సావిత్రినే కేర్ టేకర్ గా వర్క్ చేసిందట. కాగా ఇప్పుడు ఈమెకు సంబంధించిన జీతం గురించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది. సావిత్రి ..క్లింకారకు సేవలు చేస్తున్నందుకుగాను కేర్ టేకర్ గా ఉంటున్నందుకుగాను ఏకంగా నెలకు 500000 జీతం తీసుకుంటుందట .

అంతేకాదు ఉపాసన కొన్ని కోట్లు ఖర్చు చేసి క్లింకార కోసం ఇంట్లోనే ఒక సరికొత్త ప్రపంచాన్ని నిర్మించారట. ప్రస్తుతం ఇదే వార్త వైరల్ అవుతుంది. కొందరు కూతురుపై చరణ్-ఉపాసన లకి ఉన్న ప్రేమను అప్రిషియేట్ చేస్తుంటే ..కొంతమంది యాంటీ మెగా ఫాన్స్ మాత్రం డబ్బున్నోళ్లకు ఏదైనా చెల్లుతుంది అంటూ పిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news