Moviesఅరెరె..తెలిసి తెలిసి.. మెగా కోడలు విషయంలో సుధీర్ ఇంత పెద్ద తప్పు...

అరెరె..తెలిసి తెలిసి.. మెగా కోడలు విషయంలో సుధీర్ ఇంత పెద్ద తప్పు ఎలా చేశాడు..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మెగా కోడలు లావణ్య త్రిపాఠి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఫ్యామిలీ లైఫ్ ను చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు . ఒకపక్క సినిమాలు మరొకపక్క సిరీస్ లతో బిజీబిజీగా ముందుకెళ్తున్నారు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళ సినిమాలకి కమిట్ అవుతూ రెండు చేతుల బాగానే సంపాదిస్తున్నారు. రీసెంట్గా లావణ్య త్రిపాఠి నటించిన వెబ్ సిరీస్ “మిస్ పర్ఫెక్ట్”. ఈ సిరీస్ డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది .

ఈ సిరీస్ లో లావణ్య త్రిపాఠి ఒసిడి గల అమ్మాయిగా కనిపిస్తుంది. చాలా చాలా బాగా నటించింది . ఈ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరు లావణ్య త్రిపాఠిని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. కాగా రీసెంట్గా ఈ సిరీస్ కి సంబంధించిన మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . నిజానికి ఈ సిరీస్ ఎప్పుడో కమిట్ అయిందట లావణ్య త్రిపాఠి . దాదాపు సంవత్సరం ముందే ఈ సిరీస్ ని సగం కి పైగా తెరకెక్కించారట .

sudheer

అయితే ఈ సిరీస్లో మొదటగా అభిజిత్ స్థానంలో సుడిగాలి సుధీర్ ని అనుకున్నారట మేకర్స్ . సుడిగాలి సుదీర్ అప్పుడు బాగా ఫేమస్ . అయితే అప్పట్లోనే లావణ్య త్రిపాఠి .. వరుణ్ మధ్య ప్రేమాయణం ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అంతేకాదు దాని గురించి ఎంక్వయిరీ చేసిన సుధీర్ అది రియల్ అని తెలియడంతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారట. నాగబాబునే సుధీర్ కి లైఫ్ ఇచ్చారు. మరి అలాంటి ఇంటి కోడలితో ఆయన నటించడం సమంజసం కాదు అనుకున్న సుధీర్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడట . ఈ విషయం బాగా నెట్టింట వైరల్ గా మారింది..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news