Moviesఆ బ్యాడ్ సెంటిమెంట్... ' ఈగిల్ ' ప్లాప్ అని తెలిసి...

ఆ బ్యాడ్ సెంటిమెంట్… ‘ ఈగిల్ ‘ ప్లాప్ అని తెలిసి కూడా ర‌వితేజ ఎందుకిలా చేస్తున్నాడు..!

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. రవితేజకు ఒక హిట్ వస్తే నాలుగు ఫ్లాప్‌లు వస్తున్నాయి. ‘ ధమాకా ‘ హిట్ అయింది.. గత ఏడాది సంక్రాంతికి చిరంజీవితో కలిసి చేసిన మల్టీ స్టారర్ ‘ వాల్తేరు వీరయ్య ‘ సూపర్ హిట్. ఆ తర్వాత వరుసగా ‘ రావణాసుర ‘, దసరాకు వచ్చిన ‘ టైగర్ నాగేశ్వరరావు ‘ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. ఇక ఈ సంక్రాంతికి ‘ ఈగిల్ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాలని అనుకున్నారు.. సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు ఉన్నాయి. అయినా కూడా ‘ ఈగిల్ ‘ సినిమాను సంక్రాంతికి బరిలో దింపుతున్నట్టు 5 నెలల నుంచి ఈ సినిమా నిర్మాతలు హడావుడి చేశారు. చివరకు తమ సినిమాను వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

రవితేజ ఔదార్యం అని.. ఇండస్ట్రీ సంక్షేమం కోసం అని.. ఈగిల్ సినిమాను ఫిబ్రవరి కి వాయిదా వేసుకున్నారు అంటూ అందరూ అభినందించారు. కానీ అసలు వాస్తవం వేరే ఉందని తెలుస్తోంది. సినిమా అవుట్ ఫుట్ అంత గొప్పగా లేదని.. సంక్రాంతికి నాలుగు సినిమాల మధ్యలో వచ్చి నలిగిపోవటం కంటే కాస్త సోలోగా రిలీజ్ అయితే ఓపెనింగ్స్ అయినా ఉంటాయని.. భావించి రవితేజ నిర్మాతలతో చర్చించి ఈ సినిమాను స్వయంగా వాయిదా వేయించారన్న గుసగుసలు కూడా ఇండస్ట్రీలో నడుస్తున్నాయి. అసలే సంక్రాంతికి వచ్చిన సినిమాలలో ‘ హనుమాన్ ‘ తప్ప మిగిలిన సినిమాలు ఏవి అంచనాలు అందుకోలేదు.

మహేష్ ‘ గుంటూరు కారం ‘ వెంకటేష్ ‘ సైంధవ్ ‘ సినిమా కొన్న వాళ్లకు నష్టాలు తప్పడం లేదు. నాగార్జున ‘ నా సామిరంగా ‘ సినిమా ముఖి మూలిగి బ్రేక్ ఈవెన్ అయింది. ఈ టైం లో రవితేజ సినిమా కూడా వచ్చి ఉంటే కచ్చితంగా నలిగిపోయేది. అసలే ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ లోనే రిలీజ్ అనుకున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేస్తే కొంత ఓపెనింగ్స్ వస్తాయని ఆశపడ్డారు. సంక్రాంతికి పోటీ ఎక్కువ ఉండడంతో చివరకు సోలోగా రావటమే బెటర్ అనుకున్నారు. అయితే ఇక్కడే మరో బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఈ సినిమాను వెంటాడుతోంది. ఇవన్నీ దాటుకుని రవితేజ ఎలా హిట్ కొడతాడో చూడాలి.

ఫిబ్రవరిలో రిలీజ్ సెంటిమెంట్ పరంగా రవితేజకు కరెక్ట్ కాదు. గతంలో నాలుగైదు సినిమాలు ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యాయి.. మళ్ళీ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు రా బాబు అని ఇండస్ట్రీ జనాలతో పాటు రవితేజ అభిమానులు కూడా తలలు పట్టుకుంటున్నారు. ఏది ఏమైనా ఈగిల్ సినిమా నిజంగా సక్సెస్ అయితే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో పరీక్షల సీజన్ మొదలైంది. సంక్రాంతి హడావుడి పూర్తిగా తగ్గింది. సినిమా ఎంతో బాగుంటే తప్ప ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు ఫిబ్రవరి బ్యాడ్ సెంటిమెంట్ ఈ సినిమాను వెంటాడుతోంది. ఇవన్నీ దాటుకుని రవితేజ ఎలా హిట్ కొడతాడు చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news