Moviesకొరటాల శివ - నాని కాంబినేషన్లో మిస్సయిన ఆ బ్లాక్ బస్టర్...

కొరటాల శివ – నాని కాంబినేషన్లో మిస్సయిన ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఇదే.. మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడే..!

కొరటాల శివ .. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎంత చెప్పకున్నా తక్కువే. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. అంతేకాదు ఆచార్య సినిమా ముందు వరకు కూడా ఒక్కటంటే ఒక్క ఫ్లాప్ కూడా తన ఖాతాలో లేదు అంటూ గర్వంగా చెప్పుకున్నాడు. సీన్ కట్ చేస్తే ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆయన రిపీటీషన్ మొత్తం దెబ్బతింది .

ఇప్పుడు ఎన్టీఆర్ తో దేవర అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు . దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . కాగా కొరటాల శివ నాచురల్ స్టార్ నాని కాంబోలో ఒక సినిమా రావాల్సింది . కానీ ఆ సినిమా అక్కడితోనే ఆగిపోయింది . నాని రిజెక్ట్ చేయడంతో ఈ సినిమా వేరే హీరో ఖాతాలోకి పడిపోయింది . ఆ సినిమా మరేదో కాదు . “భరత్ అనే నేను” మహేష్ బాబు కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా మొదట నానితో చేయాలనుకున్నాడట కొరటాల శివ .

కానీ నాని కు పెద్దగా కథ బుర్రకి ఎక్కలేదు అందుకే ఈ కథను రిజెక్ట్ చేశాడు . మహేష్ ఈ కథను ఓకే చేసి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో నాని అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. భలే ఛాన్స్ మిస్ చేసుకున్నావ్ రా నాని అని కొందరు అంటుంటే.. మరికొందరు ఆ పాత్రకి మహేశ్ బాబు నే కరెక్ట్ అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news