Moviesఅమ్మ బాబోయ్.. ఏంటి కిరాక్ ఆర్పీ అంత పని చేశాడా..? ఉపాసన-చరణ్...

అమ్మ బాబోయ్.. ఏంటి కిరాక్ ఆర్పీ అంత పని చేశాడా..? ఉపాసన-చరణ్ ఫ్యాన్స్ సిరీయస్..!

కిర్రాక్ ఆర్ పి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు . జబర్దస్త్ కామెడీ షో ద్వారా తనలోని టాలెంట్ ను బయటపెట్టి కిరాక్ ఆర్పి మంచి కమెడియన్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత జబర్దస్త్ నుండి బయటకు వచ్చేసి..పలు షోస్ లో పార్టిసిపేట్ చేసి జబర్దస్త్ పై చేసిన వ్యాఖ్యలు అన్ని మనకు తెలిసిందే. ఈయనకు పరోక్షకంగా నాగబాబు సపోర్ట్ చేశారు అన్న కామెంట్స్ కూడా అప్పట్లో వినిపించాయి .

అయితే ఇప్పుడు కామెడీ షోస్ ఏమీ చేయకుండా బిజినెస్ రంగంలో టాప్ పొజిషన్లోకి వెళ్లిపోయాడు కిరాక్ ఆర్ పి. ఆయన సినిమాలు నిర్మించాలి అని ప్రొడ్యూసర్ గా మారారు.. కానీ మనకు సెట్ అవ్వదు అనుకున్నాడో ఏమో ఆ తర్వాత నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటూ చిన్న షాప్ ఓపెన్ చేసి ఆ షాప్ ను పలు బ్రాంచెస్ వైస్ గా మళ్లీ ఓపెన్ చేసి తన చేపల పులుసు కు మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. రీసెంట్ గా కిర్రాక్ ఆర్ పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసును మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనలకు పంపించారట . వాళ్ళు బాగుంది అంటూ మెచ్చుకున్నారట .

అంతేకాదు బోయపాటి శ్రీను గారికి కూడా నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చూపించారట . వాళ్ళు నా బ్రాండ్ ప్రమోట్ చేస్తారనో లేక మరి ఏదో ఆశించి నేను వాళ్లకు పంపలేదని.. నా స్టైల్ ఆఫ్ చేపల కూర వాళ్ళు కూడా టెస్ట్ చేస్తే నాకు ఇంకా ఆనందంగా ఉంటుందని … మళ్లీ వాళ్ళు ఫోన్ చేసి నాకు మీ చేపల పులుసు కావాలి అని అడగాలని నేను ఇలా వాళ్లకు పంపించానని చెప్పుకొచ్చారు. ప్రజెంట్ కిరాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయ్. అయితే పలువురు మెగా ఫాన్స్ మాత్రం కావాలని చరణ్ – ఉపాసన పబ్లిసిటీని వాడుకోవడానికి ఇలా చేస్తున్నాడు ఆర్పీ అని వాళ్ళు ఫోన్ చేయక్కర్లేదు .. వాళ్ళ ఫోటో పడితే చాలు అది బాగా పాపులారిటీ దక్కించేసుకుంటుంది .. ఆ విషయం తెలిసే కిర్రాక్ ఆర్ పీ ఇలా రాంచరణ్ ఉపాసన క్రేజ్ ని వాడుకుంటున్నారు అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news