Moviesసింగర్ సునీత కొడుకు ‘సర్కారు నౌకరి’ సినిమా ఎలా ఉందంటే.. సుమ...

సింగర్ సునీత కొడుకు ‘సర్కారు నౌకరి’ సినిమా ఎలా ఉందంటే.. సుమ కొడుకును బకరా చేసేశారుగా..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. తన గాత్రంతో తన అద్భుతమైన వాయిస్ తో ఎంతో మంది అభిమానులను పాటలకు ఫిదా అయ్యేలా చేస్తుంది. సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా డెబ్యూ ఇచ్చిన సినిమా ” సర్కారు నౌకరి”. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చాలా సింపుల్ గా కూల్ అండ్ క్లాసిక్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 1న థియేటర్స్ లో రిలీజ్ అయింది .

కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది మరీ ముఖ్యంగా సినిమా మొత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ కావడం ఈ సినిమాకి హైలెట్గా మారింది. 1990లో ఎయిడ్స్ వచ్చిన కొత్తల్లో జరిగిన కొన్ని యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినప్పటికి సునీత కొడుకు బాగా నటించాడు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . అంతేకాదు ఆయన ఎక్స్ప్రెషన్స్ సినిమాకి హైలైట్ గా మారాయి .

సునీత కొడుకు ఆకాష్ కి సినిమా పట్ల ఎంత ఆసక్తి ఉందో ఒక్క సినిమాతో చూపించేసాడు. హీరోయిన్ భావన కూడా బాగా నటించింది . పాటలు – మ్యూజిక్ ఎమోషనల్ సీన్స్ అభిమానలను బాగా టచ్ చేశాయి . నేటి కాలం వచ్చే సినిమాలకు ఈ సినిమా ఏ మాత్రం సరిపోదు . అయినా సరే కచ్చితంగా నేటి యువత ఒక్కసారి అయినా చూడాల్సిన సినిమా ఇది అంటున్నారు అభిమానులు . అంతేకాదు సుమ కొడుకు రోషన్ కనకాల బోల్డ్ సినిమాతో ఎంట్రీ ఇస్తే సునీత కొడుకు మాత్రం చాలా హార్ట్ టచింగ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడని .. బబుల్ గమ్ సినిమా కన్నా సర్కారు నౌకరినే చాలా బాగా మెసేజ్ ఇచ్చింది అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news