Moviesస‌మంత‌కు షాక్ ఇచ్చిన శృతీహాస‌న్‌... పాపం అది కూడా పోయిందిగా...!

స‌మంత‌కు షాక్ ఇచ్చిన శృతీహాస‌న్‌… పాపం అది కూడా పోయిందిగా…!

సినిమాల్లోకి స‌మంత రీ ఎంట్రీ ఇచ్చాక ఓ ఇంటర్నేష‌న‌ల్ మూవీలో న‌టిస్తుంద‌న్న వార్త‌లు ఎప్ప‌టినుంచో ఉన్నాయి. ఇది పాత విష‌య‌మే. అయితే ఇప్పుడు ఈ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రాజెక్టు నుంచి స‌మంత త‌ప్పుకుంది. ఈ ప్లేసులోకి శృతీహాస‌న్ వ‌చ్చేసింది. ఓ విధంగా చెప్పాలంటే ఈ ఇద్ద‌రు అవుట్ డేటెడ్ కు ద‌గ్గ‌ర్లో ఉన్నారు. ఈ టైంలో శృతీహాస‌న్ గ‌తేడాది ఏకంగా మూడు సూప‌ర్ హిట్ల‌తో లైమ్‌లైట్‌లోకి వ‌చ్చింది. బాల‌య్య‌తో వీర‌సింహారెడ్డి, చిరుతో వాల్తేరు వీర‌య్య‌.. డిసెంబ‌ర్లో ప్రభాస్‌తో స‌లార్ సినిమాలు చేసి సూప‌ర్ హిట్లు కొట్టి మంచి ఫామ్‌లో ఉంది.

ఈ టైంలో స‌మంత‌కు రాక‌రాక వ‌చ్చిన ఓ క్రేజీ ప్రాజెక్టు ఛాన్స్‌ను కూడా శృతీహాస‌న్ లాగేసుకుంది. ది ఎరేంజ్‌మెంట్స్ ఆఫ్ ల‌వ్ అనే పుస్త‌కం ఆధారంగా ఓ సినిమా వ‌స్తోంది. ఈ పుస్త‌కం చ‌దివిన స‌మంత ఈ క‌థ త‌న‌కు బాగా న‌చ్చేసింద‌ని.. ఈ సినిమాలో తాను న‌టిస్తాన‌ని ముందునుంచే ఊరేగుతూ వ‌స్తోంది. ఈ సినిమాపై స‌మంత చాలా ఆశ‌లు పెట్టుకుంది. అయితే ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో స‌మంత ఈ సినిమాలో న‌టించే ఛాన్సులు లేవు.

మ‌యోసైటీస్ వ్యాధికి గుర‌వ్వ‌డంతో పాటు చికిత్స, ఇత‌ర అనారోగ్య కార‌ణాల వ‌ల్ల స‌మంత యేడాది పాటు సినిమాలు చేయ‌న‌ని చెప్పేసింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో స‌మంత తిరిగి సినిమాల్లోకి ఎప్పుడు వ‌స్తుందో ? కూడా తెలియ‌ట్లేదు. దీంతో ఈ సినిమా మేక‌ర్స్ శృతీహాస‌న్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. అలా స‌మంత చేయాల్సిన క్రేజీ ప్రాజెక్టులోకి కాస్త శృతీ ఎంట్రీ ఇచ్చేసింది.

ఈ సినిమాలో బ్రిట‌న్‌కు చెందిన కెవిన్ హార్ట్‌, జాన్ రెనో, వామ్ వ‌ర్తింగ్ట‌న్ లాంటి వాళ్లు న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్‌లో ఉన్న ఈ సినిమా షూటింగ్ చెన్నైతో పాటు బ్రిట‌న్‌లోకి కార్టిఫ్ లాంటి న‌గ‌రాల్లో జ‌ర‌గ‌నుంది. ఏదేమైనా స‌మంత ఎంతో ముచ్చ‌ట‌ప‌డి చేయాల‌నుకున్న ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రాజెక్టు కూడా ఆమె నుంచి జారిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news