Moviesఅయోధ్యతో మెగా కోడలు లావణ్య త్రిపాఠికి ఉన్న స్పెషల్ బాండింగ్ ఏంటో...

అయోధ్యతో మెగా కోడలు లావణ్య త్రిపాఠికి ఉన్న స్పెషల్ బాండింగ్ ఏంటో తెలుసా..? వెరీ లక్కి అమ్మాయి..!!

ఇప్పుడు దేశవ్యాప్తంగా శ్రీరామ నామాలతో మారుమ్రోగిపోతున్నాయి. 500 ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరగడంతో దేశమంతా కూడా పండగ వాతావరణం నెలకొంది . పలువురు స్టార్ సెలబ్రిటీస్ రాజకీయ ప్రముఖులు అందరు కూడా నిన్న అయోధ్యలో సందడి చేశారు. దేశ ప్రజలు రాముడికి ప్రత్యేక పూజలు చేశారు .అన్నదానాలు చేశారు . ఘనంగా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు దేశ ప్రజలు .

ఇలాంటి క్రమంలోనే పలువురు అయోధ్యకు ఆహ్వానం అందిన వెళ్ళలేకపోయారు . మరికొందరు ఆహ్వానం అందక పోయినా సరే రామ మందిరం పై ఎమోషనల్ గా ట్విట్ చేశారు. కాగా ఆ లిస్టులోకి లావణ్య త్రిపాఠి కూడా వస్తుంది. మెగా కోడలిగా ట్యాగ్ చేయించుకున్న లావణ్య త్రిపాఠి అయోధ్య రామ మందిరం పై ఎమోషనల్ పోస్ట్ చేసింది . పద్ధతిగా చీరలో రెడీ అయ్యి చాలా ట్రెడిషనల్ గా ఉన్న ఫొటోస్ ను షేర్ చేస్తూ..

” రాముడి పుట్టిల్లు అయిన అయోధ్యలో నేను పుట్టడం అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. ఈ కార్యక్రమాన్ని చూడడంతో నిజంగా నా జన్మ ధన్యం అయిపోయింది. రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం చూడడం నాతో పాటు దేశ ప్రజలందరికీ గర్వకారణం . ఈ సందర్భంగా రామ్ పరివారాన్ని నగలుగా ధరించడం నాకు ఇంకా ఆనందంగా ఉంది . ఈ ప్రాణ ప్రతిష్ట వేడుక అయోధ్యకు మాత్రమే కాదు దేశం మొత్తానికి సంబంధించింది ” అంటూ చాలా ఎమోషనల్ గా స్పందించింది లావణ్య త్రిపాఠి . దీంతో లావణ్య కు అయోధ్యతో ఇంత ఎమోషనల్ బాండింగ్ ఉందా ..??అంటూ ఆశ్చర్యపోతున్నారు అభిమానులు . విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా అయోధ్యలోనే జన్మించింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news