Moviesయూట్యూబ్ ని మడత పెట్టేసిన మన రమణ గాడు..‘గుంటూరు కారం’ ట్రైలర్...

యూట్యూబ్ ని మడత పెట్టేసిన మన రమణ గాడు..‘గుంటూరు కారం’ ట్రైలర్ ఆల్ టైం రికార్డ్..చించిపడేసాడు పో..!

గుంటూరు కారం ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇదే పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. అవే పోస్టర్స్ ..అదే సినిమా టాక్ వైరల్ గా మారింది. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా గుంటూరు కారం . మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. కాగా రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్ . ట్రైలర్లో మన మహేష్ బాబు మాస్ అవతార్ ఓ రేంజ్ లో ఎక్కేసింది . అంతేకాదు గుంటూరు కారం ట్రైలర్ 24 గంటల్లోనే ఏకంగా 40 మిలియన్ల వ్యూస్ దాటేసి సంచలన రికార్డు నెలకొల్పింది.

ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది . మహేష్ బాబు అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. మన మన మహేష్ బాబు రీజనల్ సినిమాతో రికార్డులు సెట్ చేస్తుంటే ఇక తర్వాత రాబోయే రాజమౌళి సినిమాతో ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో అంటూ ఓ రేంజ్ లో హంగామా చేస్తున్నారు . కాగా త్వరలోనే మన మహేశ్ బాబు..రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించబోతున్నాడు అన్న విషయం అందరికి తెలిసిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news