Moviesఓరిఓరి.. గుంటూరు కారం పవర్ ఫుల్ స్టిల్స్ అన్ని మన తలైవావేనా.....

ఓరిఓరి.. గుంటూరు కారం పవర్ ఫుల్ స్టిల్స్ అన్ని మన తలైవావేనా.. అడ్డంగా దొరికొపోయిన త్రివిక్రమ్..!!

గుంటూరు కారం సినిమా ఏ ముహూర్తాన స్టార్ట్ చేశారో తెలియదు కానీ అప్పటినుంచి సోషల్ మీడియాలో గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ట్రోలింగ్ ఎక్కువగా జరుగుతుంది. మరీ ముఖ్యంగా రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ తర్వాత గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ట్రోలింగ్ మరింత హై స్థానంలో జరుగుతుంది . కాగా రీసెంట్గా పలువురు ఆకతాయిలు గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు నటించిన కొన్ని సీన్స్ ను రజినీకాంత్ తన సినిమాలో నటించిన సీన్స్ కు మ్యాచ్ చేస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు .

గుంటూరు కారం ట్రైలర్ లోని మహేష్ క్లిప్స్ ని రజనీకాంత్ క్లిప్స్ ని ఆడ్ చేసి స్పెషల్ వీడియో క్రియేట్ చేశారు. తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైల్, మేనరిజంకి పడి చచ్చిపోయే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు . అదే రేంజ్ లో మన మహేష్ బాబుతో కూడా కొన్ని సీన్లు తరికెక్కించాడు త్రివిక్రమ అంటూ ఫ్యాన్స్ పాజిటివ్గా కామెంట్స్ చేసుకుంటున్నారు. ఆయన కన్ను కొట్టిన ..నడిచిన.. కూర్చున్న.. చేతులు జోబుల్లో పెట్టుకున్న..

ఏదైనా సరే మన తలైవా తర్వాత ఎవరైనా.. అలాంటి తలైవాను రీప్లేస్ చేసే హీరో ఎవరూ లేరు అనుకున్నలోపే మన మహేష్ బాబు వచ్చాడు . ఇంతకంటే ఏం కావాలి అంటూ ట్రోల్ చేసే వాళ్లకు కూడా దిమ్మతిరిగే రేంజ్ లో కౌంటర్స్ వేస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన గుంటూరు కారం సినిమా ట్రైలర్ చూస్తే మహేష్ బాబు పూర్తిగా మాస్ అవతారంలో మారిపోయాడు అని చెప్పక తప్పదు . ప్రజెంట్ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news