Moviesనాగ్‌, వెంకీని మ‌హేష్ ఇంత తేలిగ్గా తీసిప‌డేశాడే...!

నాగ్‌, వెంకీని మ‌హేష్ ఇంత తేలిగ్గా తీసిప‌డేశాడే…!

ఎస్ ఇప్పుడు టాలీవుడ్ వ‌ర్గాల్లో ఇదే విష‌యం త‌ర‌చూ చ‌ర్చ‌కు వ‌స్తోంది. సంక్రాంతికి మొత్తం ఐదు క్రేజీ సినిమాలు వ‌స్తున్నాయి. మ‌హేష్‌బాబు గుంటూరుకారం, వెంక‌టేష్ సైంధ‌వ్‌, హ‌నుమాన్‌, నాగ్ నా సామి రంగా, ర‌వితేజ ఈగిల్‌… ఈ ఐదు సినిమాలలో ఒక్క‌టి కూడా వెన‌క్కు త‌గ్గేందుకు ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతో చివ‌ర‌కు పోటీ అనివార్యం అయ్యింది. అయితే థియేట‌ర్ల విష‌యంలో తెర‌వెన‌క చాలా రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి.

12న గుంటూరుకారం, హ‌నుమాన్ వ‌స్తున్నాయి. 13న ఈగిల్‌, సైంధ‌వ్ ఉన్నాయి. 14న నా సామి రంగా రిలీజ్ అవుతున్నాయి. 12న 90 శాతం థియేటర్లు గుంటూరుకారం వేస్తే 10 శాతం మాత్ర‌మే హ‌నుమాన్‌కు ఇస్తున్నారు. ఈ మ‌రుస‌టి రోజు హ‌నుమాన్ వేసిన థియేట‌ర్ల‌లో కొన్ని, అటు గుంటూరుకారం థియేట‌ర్ల‌లో ఓ 10 శాతం ఈగిల్‌, సైంధ‌వ్ పంచుకుంటాయి. ఇక 14న నాగ్ సినిమాకు కొన్ని థియేట‌ర్లు ఇస్తారు.

ఓవ‌రాల్‌గా 14వ తేదీకి వ‌చ్చేస‌రికి 60 శాతం థియేట‌ర్ల‌లో మ‌హేష్ సినిమా ఉంటే మిగిలిన 40 శాతం థియేట‌ర్లు నాలుగు సినిమాలు పంచుకోక త‌ప్ప‌దు. 14 నుంచి క‌లెక్ష‌న్లు ఐదు సినిమాలు పంచుకుంటాయి. 14 త‌ర్వాత హిట్ సినిమాకు షోలు పెరుగుతాయి… ప్లాప్ సినిమాకు స‌హ‌జంగానే షోలు త‌గ్గించేస్తారు. అయితే మ‌హేష్ దెబ్బ‌తో సీనియ‌ర్ హీరోలుగా ఉన్న వెంకీ, నాగ్ సినిమాల‌కు కూడా చెప్పుకోద‌గ్గ థియేట‌ర్లు కూడా దొర‌క‌ని ప‌రిస్థితి.

వెంకీ సైంధ‌వ్‌కు సురేష్‌బాబు బ్యాక‌ప్ ఉండ‌డంతో పర్వాలేదు గాని.. నాగ్ సినిమా ప‌రిస్థితి మ‌రీ ఘోరంగా ఉందంటున్నారు. ఇక హ‌నుమాన్ ఈ ఐదు సినిమాల మ‌ధ్య‌లో బాగా న‌లిగిపోతోన్న ప‌రిస్థితే ఇప్పుడు టాల‌వుడ్‌లో ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news