Moviesకాంట్రవర్షియల్ జ్యోతిష్కుడు వేణు స్వామీ నటించిన ఆ మూవీ ఏంటో తెలుసా..?...

కాంట్రవర్షియల్ జ్యోతిష్కుడు వేణు స్వామీ నటించిన ఆ మూవీ ఏంటో తెలుసా..? అందుకే ఆ హీరో గురించి నోరు విప్పడా..?

వేణు స్వామి.. ఈ పేరు గురించి ఇప్పుడు ఎంత చెప్పుకున్నా అది తక్కువగానే ఉంటుంది . సినిమా ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ కి మించిన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోతున్న వేణు స్వామి ..స్టార్ సెలబ్రెటీస్ జీవితాలలో జరిగే విషయాల గురించి ఓపెన్ గా బయట పెట్టడం గమనార్హం . రీసెంట్ గా కూడా ఓ టాలీవుడ్ యాంకర్ బ్రతుకు బస్టాండ్ కాబోతుంది అని .. ఆమె జీవితం నడిరోడ్డుపై పడబోతుంది అంటూ చెప్పి షాక్ ఇచ్చిన వేణు స్వామి..

సలార్ విషయంలో ఎలా బుక్ అయ్యాడో మనం చూసాం . రీసెంట్గా వేణు స్వామి ఓ సినిమాలో నటించిన క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . జగపతిబాబు – రక్షిత నటించిన “జగపతి” సినిమాలో అర్చకుడి పాత్రలో వేణు స్వామి కనిపిస్తాడు. ఈ విషయాన్ని ఇప్పుడు అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు వేణు స్వామి ఇలాంటి వేషాలు కూడా వేశాడు అంటూ కొందరు కౌంటర్స్ వేస్తున్నారు .

మరికొందరు ఆయనతో మనకెందుకు ఆయన వృత్తి ఆయన కొనసాగిస్తున్నాడు.. ఆయనను ట్రోల్ చేయడం అవసరమా అంటూ వేణు స్వామికి సపోర్ట్ చేస్తున్నారు. మొత్తానికి వేణు స్వామి నటించిన సినిమా డీటెయిల్స్ ఇప్పుడు వైరల్ కావడంతో ఆయన పేరు మరోసారి నెట్టింట మారుమ్రోగిపోతుంది. కాగా త్వరలోనే సినీ ఇండస్ట్రీలో ఇద్దరు బడా హీరో, హీరోయిన్లు చనిపోబోతున్నారు అని చెప్పి అభిమానుల గుండెల్లో రైల్లు పరిగెత్తించాడు వేణు స్వామీ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news