Moviesవిడాకుల మ్యాటర్ లో బిగ్ ట్విస్ట్.. కోలీవుడ్ ని షేక్ చేస్తున్న...

విడాకుల మ్యాటర్ లో బిగ్ ట్విస్ట్.. కోలీవుడ్ ని షేక్ చేస్తున్న సూర్య-జ్యోతిక పరసనల్ (వీడియో)..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ జ్యోతిక – హీరో సూర్య విడాకులకు సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అయ్యాయో మనం చూసాం . ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల సంఖ్యలో వీళ్ళకి సంబంధించిన వార్తలు ట్రెండింగ్ అవ్వడం అభిమానులకి షాకింగ్ గా అనిపించాయి . సూర్య జ్యోతిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . 2006లో వీళ్ల పెళ్లి ఘనంగా జరిగింది.

వీళ్ళకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సూర్య జ్యోతిక వరస చిత్రాలలో నటిస్తూ బిజీ బిజీగా ముందుకు వెళ్తున్నారు. పిల్లలు పుట్టిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్లాన్ చేసిన జ్యోతిక పలు బాలీవుడ్ సినిమాలలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . ఈ క్రమంలోనే జ్యోతిక తన సినిమా షూట్స్ కారణంగా ముంబైకి మకాం మార్చింది. అంతే ఒక్కసారిగా సూర్య – జ్యోతిక విడిపోతున్నారు అన్న వార్తలు వైరల్ అయ్యాయి.

సోషల్ మీడియాలో వీళ్ల విడాకులకు సంబంధించి ఎన్ని రకాల వార్తలు మనం విన్నామో తెలిసిందే. ఫైనల్లీ సూర్య జ్యోతిక రియాక్ట్ అయ్యారు. మేము విడాకులు తీసుకోవట్లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. అయినా కానీ కొందరు ట్రోలింగ్ ఆపలేదు. దీంతో జ్యోతిక ఫిన్ ల్యాండ్ లో సూర్యతో ఎంజాయ్ చేస్తున్న పిక్స్ ను వీడియోస్ ను షేర్ చేసింది . రొమాంటిక్గా ఉన్న సూర్య జ్యోతిక పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో ప్రెసెంట్ ఈ వీడియో టాప్ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news