Moviesఫ్లాప్ అవుతుంది అని తెలిసినా బాలయ్య చేసిన డిజాస్టర్ మూవీ ఏంటో...

ఫ్లాప్ అవుతుంది అని తెలిసినా బాలయ్య చేసిన డిజాస్టర్ మూవీ ఏంటో తెలుసా..? ఎందుకు చేశారంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో కానివ్వండి హీరోయిన్ కానివ్వండి .. సినిమా ఫ్లాప్ అవుతుంది అని తెలిసి తెలిస్తే ఎవరు ఆ సినిమా జోలికి పోరు. సగం షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయినా సరే దాన్ని ఆపేయడానికి చూస్తూ ఉంటారు . అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో బాలయ్య కు సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. నందమూరి బాలకృష్ణ కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించాడు.

కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. బోలెడు సినిమాలు హిట్ అయ్యాయి. అయితే ఒక సినిమా ఫ్లాప్ అవుతుంది అని తెలిసినా కూడా ఆయన నటించాడు . ఆ సినిమా మరేదో కాదు . తిరగబడ్డ తెలుగు బిడ్డ . అవును ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో ఈ తిరగబడ్డ తెలుగు బిడ్డ . ఈ మూవీ చేయడం బాలయ్యకు ఇష్టం లేదు.. ముందే ఈ మూవీ ఫ్లాప్ అవుతుందని ఆయనకు తెలుసు .డైరెక్టర్ కోదండరామిరెడ్డి కూడా ఈ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలుసు . కానీ ఎన్ టీఆర్ కోసం ఎక్కువ హోప్స్ పెట్టుకోకుండా సింపుల్గా లాగేసారట. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కోదండరామిరెడ్డి.

ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అనసూయమ్మ గారి అల్లుడు సినిమా డైరెక్షన్ చేశానని.. ఆ టైంలో ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో మరొక సినిమాను తెరకెక్కించే బాధ్యత నాకు ఇచ్చారు ఎన్టీఆర్ అని.. అలా చెప్పిన కథ తిరగబడ్డ తెలుగు బిడ్డ అని ..కానీ ఆ కథ నాకు నచ్చలేదు అని .. అప్పుడే ఆ సినిమాను వదిలేసానని కానీ.. ఎన్టీఆర్ స్వయంగా కాల్ చేసి అడగడంతో కాదనలేక ఇష్టం లేకపోయినా ఆ సినిమా చేశాను అని చెప్పుకొచ్చారు . ఆ సినిమా డిజాస్టర్ అయింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news