Moviesఆ స్టార్ హీరో - నాని మ‌ల్టీస్టార‌ర్ సినిమా... డైరెక్ట‌ర్ కూడా...

ఆ స్టార్ హీరో – నాని మ‌ల్టీస్టార‌ర్ సినిమా… డైరెక్ట‌ర్ కూడా ఫిక్స్‌..!

సీనియ‌ర్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ ఈ త‌రం హీరోల్లో ఎక్కువ మందితో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేశారు. ప‌వ‌న్‌, మ‌హేష్‌, వ‌రుణ్‌తేజ్‌, రామ్, నాగ‌చైత‌న్య‌తో క‌లిసి వెంకీ మ‌ల్టీస్టార‌ర్ సినిమాలు చేశారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు వెంకీ మ‌రో కుర్ర స్టార్ హీరోతో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్‌కు రెడీ అవుతున్న‌ట్టు తెలుస్తోంది. ఆ హీరో ఎవ‌రో కాదు నేచుర‌ల్ స్టార్ నాని. వీరిద్ద‌రు క‌లిసి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌వుతోన్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

గుంటూరు కారం త‌ర‌వాత త్రివిక్ర‌మ్ సినిమా గురించి చాలా చ‌ర్చ న‌డుస్తోంది. ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది. గుంటూరు కారం రిజ‌ల్ట్ త‌ర్వాత అల్లు కాంపౌండ్ త్రివిక్ర‌మ్‌ను చాలా తెలివిగా సైడ్ చేసి ప‌డేసింది. బోయ‌పాటితో గీతా బ్యాన‌ర్లో ఓ పాన్ ఇండియా మాస్ సినిమాకు రెడీ అవుతోంది. ఈ ప్ర‌క‌ట‌న‌తోనే త్రివిక్ర‌మ్ మాకు అక్క‌ర్లేద‌ని క్లారిటీ ఇచ్చేసింది అల్లు కాంపౌండ్‌.

ఇక ఇప్పుడు త్రివిక్ర‌మ్ ఎవ‌రిని అయినా వెతుక్కోవాలి. ఈ క్ర‌మంలోనే ఎప్పుడో నాని – వెంకీ కాంబినేష‌న్లో ఓ మ‌ల్టీస్టార‌ర్‌కు క‌థ రాసుకున్నాడ‌ట‌. ఈ క‌థ‌ను నానికి ఎప్పుడో చెప్ప‌గా నాని గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడు. నాని కోరిక మ‌రోలా ఉంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సోలో హీరోగా సినిమా చేస్తే త‌న మార్కెట్ పెరుగుతుంద‌న్న లెక్క‌ల్లో ఉన్నాడు. ఇక త్రివిక్ర‌మ్ మ‌ల్టీస్టార‌ర్ అని చెప్ప‌డంతో ఇష్టం ఉన్నా లేక‌పోయినా ఓకే చెప్పాడు.

ఇక త్రివిక్ర‌మ్ – వెంకీ కాంబినేష‌న్లో కూడా ఎప్ప‌టి నుంచో సినిమా బాకీ ఉంది. వెంకీ సోలో హీరోగా త్రివిక్ర‌మ్ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడు. ఇప్పుడు నానితో క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ చేసేందుకు కూడా నో చెప్పే ప‌రిస్థితే లేదు. వెంకీ మ‌ల్టీస్టార‌ర్ సినిమాల‌కు ఎప్పుడూ ముందే ఉంటాడు. ఒక‌వేళ వెంకీ అటూ ఇటూ అయితే ఆప్లేస్‌లో ఏ నాగార్జునో లేదా మ‌రో హీరోనో తీసుకుని సినిమా చేసేయాల‌ని త్రివిక్ర‌మ్ ప్ర‌య‌త్నాలు అయితే మొద‌ల‌య్యాయంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news