Moviesఅమోధ్య రాముడి ముఖంలో ఆ హీరో పోలికలు..మీరు గమనించారా..!

అమోధ్య రాముడి ముఖంలో ఆ హీరో పోలికలు..మీరు గమనించారా..!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలకు ఫ్యాన్స్ ఎక్కువ . వాళ్లను ఫాన్స్ గా కన్నా కూడా దేవుడిలా భావిస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎంతలా దేవుడిగా ఆరాధిస్తూ ఉంటారో మనకు తెలిసిందే. కాగా ఫ్యాన్స్ తమ హీరో పై ఉన్న ప్రేమతో అభిమానంతో రకరకాలుగా వాళ్ళ పేర్లను ప్రమోట్ చేస్తూ ఉంటారు.. పబ్లిసిటీ చేస్తూ ఉంటారు.

అయితే రీసెంట్గా ఒక స్టార్ హీరో ఫ్యాన్స్ మాత్రం ఫుల్ రేంజ్ లో రెచ్చిపోయారు . ఎంతలా అంటే ఏకంగా రాముడు విగ్రహం లో ఆయన పోలికలు ఉన్నాయి అంటూ ప్రచారం చేస్తున్నారు . మనకు తెలిసిందే . రీసెంట్ గా అయోధ్య రాముడు విగ్రహం ప్రతిష్టాపన బాగా ఘనంగా జరిగింది . అయోధ్యలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది . హారతి ఇచ్చేటప్పుడు నరేంద్ర మోడీ సైతం ఎమోషనల్ అయిపోయారు .

చాలామంది భక్తి పార్వస్యంతో మునిగి తేలిపోయారు. ఇప్పటికే అయోధ్య రాముడు విగ్రహానికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి . అయితే తాజాగా దివంగత నటుడు విజయ్ కాంత్ ఫ్యాన్స్ సరికొత్త న్యూస్ ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. అయోధ్యలోని రాముడు విగ్రహంలో విజయ్ కాంత్ పోలికలు ఉన్నాయి అంటూ ప్రచారం చేస్తున్నారు .దానికి సంబంధించిన కొన్ని పిక్స్ ను ట్రెండ్ చేస్తున్నారు . సోషల్ మీడియాలో ఈ పిక్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. కొంతమంది ఇది మరి టూమచ్ అంటుంటే ..మరి కొంతమంది ఎవ్వడి పిచ్చి వాడికి ఆనందం అంటున్నారు..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news