Moviesయూఎస్‌లో ' స‌లార్ ' వ‌సూళ్ల వీరంగం... ఫ‌స్ట్ డే ఎన్ని...

యూఎస్‌లో ‘ స‌లార్ ‘ వ‌సూళ్ల వీరంగం… ఫ‌స్ట్ డే ఎన్ని కోట్లు వ‌చ్చాయంటే…!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్ష‌న్ సినిమా స‌లార్‌. భారీ అంచ‌నాల మ‌ధ్య‌.. పాన్ ఇండియా సినిమాగా ఈ రోజు థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన స‌లార్‌కు గ‌త అర్ధ‌రాత్రి నుంచే షోలు ప‌డిపోయాయి. ఏపీ, తెలంగాణ‌లో అర్ధ‌రాత్రి 1 గంట‌కే షోలు ప‌డిపోవ‌డంతో స‌లార్‌కు అదిరిపోయే టాక్ వ‌చ్చింది.

ఇక సినిమా ఫ‌స్ట్ డే నుంచే బ్లాక్బ‌స్ట‌ర్ టాక్‌తో దూసుకుపోతోంది. ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్‌గా రు. 200 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు సాధిస్తుంద‌న్న అంచ‌నాలు అయితే ఉన్నాయి. ఇక ఇండియాలోనే కాకుండా ఓవ‌ర్సీస్‌లోనూ స‌లార్ మాసీవ్ బుకింగ్స్ న‌మోదు చేసింది. జ‌స్ట్ ప్రీమియ‌ర్ల‌తోనే ఎప్పుడో 2 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు రాబ‌ట్టిన స‌లార్ లేటెస్ట్‌గా 2.4 మిలియ‌న్ డాల‌ర్ల‌ను న‌మోదు చేసింది.

అంటే ఫ‌స్ట్ డే వ‌సూళ్లు పూర్త‌య్యే స‌రికి 2.5 మిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరువైంది. ఫ‌స్ట్ వీకెండ్ ముగిసే స‌రికే సలార్ 5 మిలియ‌న్ డాల‌ర్ల‌ను ఈజీగా క్రాస్ చేస్తుంద‌ని తెలుస్తోంది. ఇక 2.5 మిలియ‌న్ డాల‌ర్లు అంటే ఫ‌స్ట్ డేనే అక్క‌డ రు. 15 కోట్ల‌కు పైగానే గ్రాస్ వ‌సూళ్లు సాధించిన‌ట్టు అవుతుంది. ఇది మామూలు ఊచ‌కోత కాద‌నే చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news