Moviesసలార్ లో నటించిన ఈ కుర్రాడు మన టాలీవుడ్ స్టార్ హీరో...

సలార్ లో నటించిన ఈ కుర్రాడు మన టాలీవుడ్ స్టార్ హీరో కొడుకే..గుర్తు పట్టారా..!

సలార్ .. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . బాహుబలి సినిమా తర్వాత చాలా టైం గ్యాప్ తీసుకొని మరి హిట్ అందుకున్నాడు ప్రభాస్ . డిసెంబర్ 22న గ్రాండ్గా థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో తోనే బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకునింది మొదటి రోజే ఏకంగా 175 కోట్ల కలెక్షన్స్ అందుకొని బాహుబలి రికార్డును తుక్కుతుక్కు చేసింది.

మరీ ముఖ్యంగా ప్రభాస్ ఈ సినిమాలో నటించిన తీరు అభిమానులను బాగా ఆకట్టుకుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో సలార్ సినిమాలో నటించిన నటీనటుల డీటెయిల్స్ వైరల్ అవుతుంది. అయితే ఈ సినిమాలో పృథ్వీరాజ్ చిన్నప్పటి పాత్ర చేసిన కుర్రాడి పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది. ఆ ఎక్స్ప్రెషన్స్ హావ భావాలు ఎంత అద్భుతంగా నటించాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

అందుకే గూగుల్లో బాగా ఈ అబ్బాయి గురించి సెర్చ్ చేస్తున్నారు రెబల్ ఫాన్స్ . అయితే ఆ కుర్రాడు మరెవరో కాదు టాలీవుడ్ హీరో రవితేజ కజిన్ బ్రదర్ కొడుకు అంటూ తెలుస్తుంది అంటే రవితేజకు వరుసకి కొడుకు అవుతాడు అన్నమాట అతని పేరు కార్తికేయ దేవ్. ప్రజెంట్ అబ్బాయి పదవ తరగతి చదువుతున్నాడు. సలార్ లో పృథ్వీరాజ్ చిన్నపటి పాత్ర కోసం చాలామందిని అప్రోచ్ అయిన ఆడిషన్ తీసుకున్న కార్తికేయ దేవ్ ని ఫైనలైజ్ చేసాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమా హిట్ అవ్వడానికి ఆయన పాత్ర కూడా ఒక కారణం అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news