Moviesనాగార్జున‌కు ఘోర అవ‌మానం... టాలీవుడ్‌లో ఇంత లైట్ తీస్కొంటున్నారా...!

నాగార్జున‌కు ఘోర అవ‌మానం… టాలీవుడ్‌లో ఇంత లైట్ తీస్కొంటున్నారా…!

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు ఘోర‌ అవమానం ఎదురయింది. అసలు నాగార్జునను కనీసం సీనియర్ హీరోగా కూడా టాలీవుడ్ గుర్తించడం లేదని అర్థమవుతుంది. తాజాగా ఈరోజు సంక్రాంతి సినిమాల నిర్మాతలు మీటింగ్ జరిగింది. సంక్రాంతి బరిలో మొత్తం ఐదు సినిమాలు ఉన్నాయి. నాగార్జున నా సామిరంగా, మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్‌, తేజ స‌జ్జ హనుమాన్, రవితేజ ఈగిల్ ఒకేసారి ఐదు సినిమాల వస్తే థియేటర్‌లో ఇబ్బంది తప్పదు. పెద్ద సినిమాల కలెక్షన్లపై కూడా ప్రభావం చూపుతుంది.. అందుకే సంక్రాంతి సినిమాల నిర్మాతలతో దిల్ రాజు ఏర్పాటు చేసిన తొలి మీటింగ్ ఘోరంగా విఫలమైంది.

హనుమాన్ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి అసలు ఈ సమావేశానికి హాజరు కాలేదు. పైగా ఈ సమావేశంలో నిర్మాతలు తాము ముందుగా రిలీజ్ డేట్ కాదు.. మేము ముందుగా ప్రకటించామంటూ నిర్మాతలు వాదించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా వెనక్కు తగ్గేలా లేరని తెలుస్తోంది. గుంటూరు కారం మహేష్ బాబు – త్రివిక్ర‌మ్‌ సినిమా వాళ్లు తగ్గరు, సైంధవ్ సినిమా వ్యవహారాలు సురేష్ బాబు చూసుకుంటున్నారు. ఆయనకు ఎవరు ఎదురు చెప్పరు. ఇక మిగిలింది ఈగిల్, హనుమాన్, నా సామిరంగా సినిమాలు. ఈగిల్ సినిమా అగ్రిమెంట్లు పూర్తి చేసుకుంది.

హనుమాన్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతుంది.. అగ్రిమెంట్లు పూర్తయ్యాయి. అయితే నా సామిరంగా సినిమాకు ఎవరు కూడా థియేటర్‌లు ఇచ్చేందుకు అంత ఆసక్తితో లేరని తెలుస్తోంది. చివరకు హనుమాన్ సినిమాకు అయినా కొన్ని థియేటర్లు ఇచ్చేలా ఉన్నారే తప్ప.. నా సామిరంగా సినిమాకు థియేటర్‌లు ఇచ్చే విషయంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆసక్తిగా లేరు. అంటే నాగార్జున సినిమాలపై టాలీవుడ్ జనాలకు ఏమాత్రం ఆసక్తి లేదని అర్థమవుతుంది. నిజంగా నాగర్జున లాంటి సీనియర్ హీరోకు ఇది ఘోర అవమానం అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news