Moviesమృణాల్ కి ఎంగేజ్మెంట్ రింగ్ పంపిన ఆ స్టార్ సెలబ్రిటీ ఎవరో...

మృణాల్ కి ఎంగేజ్మెంట్ రింగ్ పంపిన ఆ స్టార్ సెలబ్రిటీ ఎవరో తెలుసా..? వైరల్ గా మారిన లేటెస్ట్ న్యూస్..!

ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ కి సంబంధించిన విషయాలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తూనే ఉన్నాము. మరీ ముఖ్యంగా ఏ హీరోయిన్ అయితే టాప్ రేంజ్ లో దూసుకుపోతుందో ఆ హీరోయిన్ కి సంబంధించిన విషయాలను జనాలు ఎక్కువగా తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . తాజాగా బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన ఒక వార్త నెట్టింట వైరల్ గా మారింది. రీసెంట్ గానే ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో నటించిన ఈమె ఆడియన్స్ ని ఫిదా చేసింది .

ఆఫ్ కోర్స్ ఈ సినిమా ఫ్లాప్ అయింది. అయినా కూడా మంచి పాజిటివ్ కామెంట్స్ దక్కించుకుంది . కాగా ప్రెసెంట్ టాలీవుడ్ – బాలీవుడ్ ఇండస్ట్రీలలో దూసుకుపోతున్న బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హోస్ట్ తన్మయి భట్ కి రిప్లై ఇచ్చి సెటైర్ వేయించుకున్న న్యూస్ వైరల్ గా మారింది . ఓ ఈవెంట్ కి సంబంధించిన వీడియో పోస్ట్ చేశాడు తన్మయి భట్. ” ఇక్కడ వీళ్లను పరిచయం చేసేందుకు నేను ఉన్నాను ..మరి నా లైఫ్ పార్టనర్ ని పరిచయం చేసేందుకు ఎవరున్నారు..? అనే విధంగా రాసుకొచ్చాడు తన్మయి భట్.

“దీంతో అమ్మాయి దొరికిందా..?” అంటూ రిప్లై ఇచ్చింది మృణాల్. ఆమె రిప్లైకు కౌంటర్ వేశాడు తన్మయి భట్. ” అవును కదా నిన్ననే నీకు నేను రింగ్ పంపించాను” అంటూ షాకింగ్ కౌంటర్ వేస్తాడు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో మనం మృణాల్ ఠాకూర్ కి సంబంధించిన విషయాల గురించి ఎలా వింటున్నామో బాగా తెలిసిందే. మరీ ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ తో ప్రేమాయణం నడుపుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది . త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతుంది అంటూ బాగా వార్తలు వినిపిస్తున్నాయి . అయితే అలాంటిది ఏదీ లేదు అని తాను ఇప్పటికీ సింగిల్గానే ఉన్నాను అని పలు ఇంటర్వ్యూలలో మృణాల్ ఠాకూర్ క్లారిటీ ఇస్తూ ఉండడం గమనార్హం..!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news