MoviesRRR కంటే స‌లార్ చాలా గ్రేట్‌... రాజ‌మౌళికి దిమ్మ‌తిరిగింది చూడండి...!

RRR కంటే స‌లార్ చాలా గ్రేట్‌… రాజ‌మౌళికి దిమ్మ‌తిరిగింది చూడండి…!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమాతో చాలా రికార్డులు సెట్ చేయాలని చూసాడు ప్రభాస్. చాలా రికార్డులు దుమ్ము దులిపేశాడు. తొలిరోజు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఓ కీలకమైన రికార్డ్‌ మాత్రం ప్రభాస్ నుంచి తృటిలో చేజారింది. అయితే నైజాం ఓపెనింగ్ అయినా కూడా ప్రభాస్ చాలా గ్రేట్ అని చెప్పాలి. నైజాంలో ఇప్పటివరకు బిగ్గెస్ట్ ఓపెనర్ ఆర్‌ఆర్ఆర్.

టాలీవుడ్ క్రేజీ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన ఆ సినిమాకు మొదటి రోజు రూ.23.35 కోట్ల షేర్ వచ్చింది. ఆ రికార్డును సలార్ బద్దలు కొట్టలేకపోయింది. మొదటి రోజు ఈ సినిమాకు నైజాంలో రూ.22.5 కోట్ల షేర్ వచ్చింది. సలార్ సినిమాకు నైజాంలో టికెట్ రేట్లు భారీగా పెంచారు. బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చారు. ఈ సినిమా ఆర్‌ఆర్ఆర్ రికార్డును క్రాస్ చేస్తుందని అనుకున్నా రెండో స్థానానికి పరిమితమైంది. అయితే ఆర్‌ఆర్ఆర్ సినిమాలో ఏకంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నారు. రాజమౌళి బ్రాండ్ ఉంది.

ఈ సినిమాకు రిలీజ్ ముందు నెల రోజుల నుంచి భారీ ఎత్తున జాతీయ‌ స్థాయిలో ప్రమోషన్లు చేశారు. రాజమౌళి చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. అసలు ప్రభాస్ సినిమాకు ఎలాంటి ప్రమోషన్లు లేవు. దీనికి తోడు షారుఖ్ ఖాన్ నటించిన ఢంకీ సినిమా నైజాంలో చాలా మల్టీప్లెక్స్‌ల‌లో ఆడుతుంది. మరోవైపు నాని హాయ్ నాన్న సినిమా కూడా ఆడుతుంది. హాలీవుడ్ మూవీ ఆక్వామేన్ సినిమా కూడా మల్టీప్లెక్స్‌ల‌లో ఉంది. ఇవన్నీ లేకపోతే సలార్ సినిమా ఖచ్చితంగా ఆర్‌ఆర్ఆర్ డే1 రికార్డులకు చెక్ పెట్టేసేది.

అయితే కేవలం రూ.80 లక్షల తేడాలో ప్రభాస్ నైజం డే 1 రికార్డు కోల్పోవలసి వచ్చింది. ఆర్‌ఆర్ఆర్ రికార్డును ప్రభాస్ క్రాస్ చేయలేకపోయినా కూడా.. పైన చెప్పుకున్న పరిమితులతో కేవలం రూ.80 లక్షల దూరంలో ఈ రికార్డుకు ఆగటం అంటే ప్రభాస్ గ్రేట్ అని చెప్పుకోవాలి. అలాగే ఆర్‌ఆర్ఆర్ సినిమా కంటే సలార్ గ్రేట్ అని చెప్పాలి. ఏది ఏమైనా రాజమౌళి ఎన్నిస్ట్రాట‌జీలు వాడినా ఎలాంటి స్ట్రాటజీలో లేకుండా వచ్చిన సలార్ నైజాంలో దుమ్ము దులిపేసింది. ఇక నార్త్ లో ఈ సినిమాకు తొలి రోజు ఏకంగా రూ.15 కోట్ల షేర్ వచ్చింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news