Moviesవివాదంలో టాలీవుడ్ హీరో మహేష్ బాబు .. ఆ సెన్సేషనల్ వీడియోని...

వివాదంలో టాలీవుడ్ హీరో మహేష్ బాబు .. ఆ సెన్సేషనల్ వీడియోని డిలీట్ చేయించింది ఎవరు..?

ఇది వినడానికి షాకింగ్ గా ఉన్న ఇదే నిజం . ఇప్పుడు ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మరి ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులకి కోపం కూడా తెప్పిస్తుంది. మనకు తెలిసిందే మహేష్ బాబు ఎటువంటి కాంట్రవర్షియల్ కంటెంట్ లో ఇరుక్కోవడానికి ఇష్టపడడు . ఆయన నోటి నుంచి ఎటువంటి కాంట్రవర్షియల్ మాట కూడా రాదు. అయితే మహేష్ బాబు తాజాగా ఒక బిగ్ ప్రాబ్లం లో ఇరుక్కున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . మహేష్ బాబు సినిమాలో నటిస్తూనే పలు యాడ్స్ ని ప్రమోట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. దానికి కోట్ల రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటూ ఉంటారు.

అయితే తాజాగా పాన్ బహార్ గుట్కా యాడ్ ను మహేష్ బాబు ప్రమోట్ చేయడం ఆయనకు విమర్శలు తగిలేలా చేసింది. అది ఏమి పోషక ఆహారం కాదు ..అది పేరుకు మాత్రమే మౌత్ ఫ్రెష్నర్.. కానీ అందులో తంబాకు .. పొగాకు మిశ్రమాలతో చేసిన నోటి క్యాన్సర్కు కారణమయ్యే ఒకానొక పదార్థం కూడా ఉంటుంది . ఈ విషయం చాలామందికి తెలుసు. అయితే అలాంటి ప్రోడక్ట్ ని మహేష్ బాబు ప్రమోట్ చేయడం ఏంటి అంటూ వార్తలు వచ్చాయి . మరి ముఖ్యంగా ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . మహేష్ బాబు డబ్బు కోసం ఇలా చేస్తాడా..? అంటూ ఆయనను విమర్శించే విధంగా ఆ వీడియో ఉంది .

అయితే ఈ వీడియో బాగా రీచ్ అవడంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ టెన్షన్ పడిపోయారు. అయితే ఎలా జరిగిందో ..? ఎప్పుడు జరిగిందో..? తెలియదు కానీ ఆ వీడియో మాయమైపోయింది . కొందరు డిలీట్ చేయించేశారు . ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ ఆ వీడియో కనిపించడం లేదు. అయితే ఇది మహేష్ బాబు పిఆర్ టీం తీయించారు అంటున్నారు కొంతమంది జనాలు . మరికొందరు లేదు లేదు మహేష్ బాబు పిఆర్ టీం కి ఈ వీడియో తీసేయడంలో సంబంధం లేదు అంటున్నారు .

ఎవరు తీయించారో తెలియదు కానీ ఆ వీడియో డిలీట్ చేసి మంచి పనే చేశారు . అయితే మొదటి నుంచి మహేష్ బాబు అంటే పడని వాళ్ళు ఆయనపై నెగటివ్గా వార్తలను స్ప్రెడ్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా నార్త్ హీరోలకి మహేష్ బాబు అంటే అస్సలు పడదు. బహుశా వాళ్లు కూడా ఇలా ట్రోలింగ్ చేయిస్తున్నారేమో అంటూ అభిప్రాయపడుతున్నారు ఘట్టమనేని ఫ్యాన్స్ . ఇప్పుడు ఆ వీడియో అసలు ఎలా డిలీట్ అయింది ..? ఎవరు డిలీట్ చేయించారు అనేది ప్రశ్నార్థకంగా మారింది..???

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news