Newsస‌లార్ సెన్సార్ పూర్తి.. ర‌న్ టైం ఎంతో తెలుసా..? ఫ్రభాస్...

స‌లార్ సెన్సార్ పూర్తి.. ర‌న్ టైం ఎంతో తెలుసా..? ఫ్రభాస్ కెరీర్ లోనే ఫస్ట్ టైం ఇలా..!

టాలీవుడ్ రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే . మొదటి పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోని చిత్ర ప్రమోషన్స్ లో బిజీబిజీగా ముందుకెళ్ళిపోతుంది సలార్ టీం.

డిసెంబర్ 1న ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేయగా ఆ సినిమాకు ఆ ట్రైలర్ కు విశేష స్పందన లభించింది . టాక్ పరంగా అటు ఇటుగా ఉన్న ఏకంగా అన్ని భాషల్లో కలిపి 150 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకుంది . అయితే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ టాక్ ఇప్పుడు వైరల్ గా మారింది . ఈ సినిమా సెన్సార్ పూర్తయింది . ఈ సినిమాకి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు సెన్సార్ సభ్యులు .

అంతేకాదు ఈ మూవీ రన్ టైం రెండు గంటల 55 నిమిషాల 22 సెకండ్లకు లాక్ చేసినట్లు తెలుస్తుంది . అదే సమయంలో మూవీ మొదలైన అరగంట తర్వాత ప్రభాస్ ఎంట్రీ ఉంటుందట . అంతేకాదు ఒక్కొక్క సీన్లో ప్రభాస్ గూస్ బంప్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు అంటూ టాక్ వినిపిస్తుంది . అంతేకాదు ప్రభాస్ కెరియర్ లో ఇంత పెద్ద రన్ టైం గల సినిమాలు చాలా తక్కువ అని ఆ విధంగా చూసుకుంటే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news