Newsరాత్రికి రమ్మంటూ పవన్ హీరోయిన్ కు క్యాబ్ బుక్ చేసిన..ఆ స్టార్...

రాత్రికి రమ్మంటూ పవన్ హీరోయిన్ కు క్యాబ్ బుక్ చేసిన..ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా.?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా తమ్ముడు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. మెయిన్ హీరోయిన్ గా ప్రీతి జింగానియా నటించగా రెండో హీరోయిన్గా అదితి గోవిత్రికర్ నటించింది. ఈ సినిమాలో నటించే టైంకే ఆమెకు పెళ్లి అవ్వడంతో పాటు ఒక పాప కూడా జన్మించింది. అయినా కూడా ఈ సినిమాలో ఆమె వయ్యారాలు వ‌ల‌క‌బోస్తూ.. పవన్ లవర్ గా కొంటి చూపులతో కవ్వించింది. “వయ్యారి భామ నీ హంస నడక ..ఎందుకే ఈ తొందర తొందర” అంటూ వచ్చే పాటతో చాలా ఫేమస్ అయింది. ఈ పాటతో పవన్ కళ్యాణ్ ఎంత ఫేమస్ అయ్యారో తెలిసిందే.

అయితే తమ్ముడు సినిమా తర్వాత మళ్లీ అదితి తెలుగులో సినిమాలు చేయలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో అదితి తన సినీ కెరీర్‌కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది. ” తాను కూడా కో స్టార్‌ హీరోతో క్యాస్టింగ్ సమస్య ఎదుర్కొన్నట్టు స్పష్టం చేసింది. తాను ఓ స్టార్ హీరో సినిమాలో నటిస్తున్న టైం లో ఆఫ్రికాలో షూటింగ్ ఉండటంతో అక్కడికి వెళ్లానని.. అక్కడ షూటింగ్ జరుగుతున్న టైం లోనే ఆ హీరో తన కొంటేసైగ‌లతోనే నన్ను లోబరుచుకోవాలని చూశాడని తెలిపింది.

ఆయన చేసే సిగ్నల్స్ అర్థం చేసుకున్న తాను నవ్వుకుంటూ నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ మాట్లాడానని.. అయితే నా మాటలు సీరియస్గా తీసుకున్న హీరో ఆ మరుసటి రోజు షూటింగ్‌కు ప్యాకప్ చెప్పేసి నన్ను తిరిగే ముంబై పంపించేసారని వాపోయింది. ఆ తర్వాత అదే హీరో ఒకరోజు హోటల్లో కలిశాడని..ఆ టైంలో నేను మా డాడీకి చాలా క్లోజ్ అంటూ చెప్పాను.. దానికి ఆ హీరో మీ డాడీకి నువ్వు క్లోజ్ అయితే డాడీ నేను ఈరోజు రాత్రి ఇంటికి రాను.. రేపు మార్నింగ్ వచ్చేస్తా అని చెప్పు అని ఒత్తిడి చేశాడని.. తాను కన్నీళ్ళతో అక్కడ నుంచి బయటికి వెళ్లిపోయినట్టు తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి అదితి బయటపెట్టింది.”

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news