Newsసినిమా హిట్ అవ్వడం కోసం అలాంటి పని చేసి .. షాక్...

సినిమా హిట్ అవ్వడం కోసం అలాంటి పని చేసి .. షాక్ ఇచ్చిన హీరోయిన్స్ వీళ్ళే..!!

సినిమా ఇండస్ట్రీలో కేవలం కొంతమంది హీరోయిన్స్ మాత్రమే రేర్ రికార్డ్ అచీవ్ చేస్తూ ఉంటారు . ఒకే ఫ్యామిలీకి సంబంధించిన రెండు జనరేషన్ హీరోలలో నటించి స్పెషల్ క్రేజీ రికార్డ్స్ తమ ఖాతాలో వేసుకుంటూ ఉంటారు . వాళ్ళు ఎవరో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం ..!!

శ్రీదేవి : సినిమా ఇండస్ట్రీలో అతిలోకసుందరిగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీదేవి చాలా టాలెంటెడ్ . ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోలతో నటించింది. అయితే శ్రీదేవి అక్కినేని నాగేశ్వరరావు తో సినిమాల్లో నటించింది. ఆ తర్వాత శ్రీదేవి ఆయన కొడుకు నాగార్జునతో కలిసి కూడా నటించింది . నాగార్జున తో గోవిందా గోవిందా , ఆఖరిపోరాటం సినిమాలో నటించి మెప్పించ్చింది.

నయనతార : లేడీ సూపర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న నయనతార దగ్గుబాటి ఫ్యామిలీలో ఉన్న వెంకటేష్ తో కలిసి లక్ష్మీ – తులసి లాంటి సినిమాల్లో నటించింది . ఆ తర్వాత రానా దగ్గుబాటి తో కలిసి కృష్ణం వందే జగద్గురుం సినిమాలో నటించి మెప్పించింది.

సమంత : మల్టీ టాలెంటెడ్ గల సమంత ఇండస్ట్రీలో ఎంత స్టార్ హీరోయిన్గా మారిందో మనకు తెలిసిందే. కాగా ఒకే ఫ్యామిలీకి చెందిన హీరోలతో సమంత ఆడి పాడి అలరించింది . పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది సినిమాలో నటించిన ఈమె ..అల్లు అర్జున్తో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో నటించింది . అదేవిధంగా రాంచరణ్ తో రంగస్థలం సినిమాలోను నటించింది.

శ్రేయ శరణ్ : మల్టీ టాలెంటెడ్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న శ్రేయ శరణ్ బాలకృష్ణతో చెన్నకేశవరెడ్డి సినిమాలో నటించింది ..ఆ తర్వాత ఎన్టీఆర్ తో నా అల్లుడు సినిమాలో నటించి మెప్పించింది.

శృతిహాసన్: కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాలో నటించింది.. ఆ తర్వాత రామ్ చరణ్ తో ఎవడు సినిమాలో నటించింది.. అల్లు అర్జున్తో రేసుగుర్రం సినిమాలో కనిపించి మెప్పించింది.

కాజల్ అగర్వాల్ :మల్టీ టాలెంటెడ్ గల కాజల్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ ..రాంచరణ్ తో మగధీర ..అల్లు అర్జున్తో ఆర్య 2 ..చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించి మెప్పించింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news