Movies"ప్రభాస్ ఆరోగ్యం గురించి మీకేం తెలుసు రా వెధవల్లారా..?" రెచ్చిపోయిన వేణు...

“ప్రభాస్ ఆరోగ్యం గురించి మీకేం తెలుసు రా వెధవల్లారా..?” రెచ్చిపోయిన వేణు స్వామీ ..షాకింగ్ కామెంట్స్..!!

ప్రజెంట్ వేణు స్వామి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి . ప్రభాస్ ఫ్యాన్స్ ని పరోక్షంగా కెలికి పెద్ద తప్పు చేశాడు వేణు స్వామి అంటున్నారు అభిమానులు. మనకు తెలిసిందే వేణు స్వామి చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది అంటూ ఇండస్ట్రీలో బాగా నమ్ముతారు . బయట జనాలు కూడా ఆయనను ప్రత్యేకంగా కలిసి పూజలు చేయించుకుంటారు. అంత నమ్మకం . అయితే అలాంటి వేణు స్వామి ప్రభాస్ జాతకంపై చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

“ప్రభాస్ కెరియర్ ఆశాజనికంగా ఉండదు అని ..ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతాయని ఆయనకు ఆరోగ్యపరంగా కూడా పలు సమస్యలు ఉన్నాయి అంటూ చెప్పుకు వచ్చారు”. అయితే సలార్ సినిమా కూడా ప్లాప్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చిన వేణు స్వామి జాతకం తప్పు అంటూ రెబెల్ ఫాన్స్ మండిపడ్డారు . సలార్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . ఇక నువ్వు జాతకాలు చెప్పడం మానేసేయ్ అంటూ కౌంటర్స్ వేశారు .

దీంతో ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వేణు స్వామి ఇప్పుడు ఫుల్ ఫైర్ అయిపోయారు. ప్రభాస్ ఆరోగ్యం గురించి మీకేం తెలుసు రా వెధవల్లారా ..? అంటూ రెచ్చి పోయారు . “ఒరేయ్ ఆస్ట్రేలియా ఆజాము సూపర్ స్టార్ అంటే విడుదలైన సినిమాలలో 90% సినిమాలు హిట్లు కొట్టడం రా .. అంతేకాని విడుదలైన నాలుగు సినిమాలలో ఒకే సినిమా హిట్టు పడితే ఏమనాలి రా ఆజాము ..ఆస్ట్రేలియా ఆజాము 4 సినిమాలకి ఒక్క సినిమా హిట్ కొట్టడం కాదురా ఆజాము ఆస్ట్రేలియా” అంటూ విరుచుకుపడ్డారు .

అంతేకాదు ఆయన మాట్లాడుతూ..” ప్రభాస్ విషయములు తాను చెప్పేదే నిజం అని అన్నారు . దీనికి వివరణ ఇస్తూ సలార్ రిలీజ్ కు ముందు చేసిన వ్యాఖ్యలు కూడా పోస్ట్ చేశారు .ప్రభాస్ విషయంలో నేను చెప్పినవి కొన్ని బయటకు వస్తాయి.. కొన్ని రావు కానీ నేను చెప్పిందే నిజం .. ప్రభాస్ కి ఆరోగ్యం బాగోలేదు.. సమస్యలు ఉన్నాయి అందుకే సర్జరీకి కూడా చేయించుకున్నాడు. సలార్ ప్రమోషన్స్ కి కూడా సరిగ్గా రాకపోవడానికి కారణం అదే ..ఇలాంటివి బయటకు రావు కానీ లోలోపల జరుగుతాయి ..మీకేం తెలుసురా వెధవల్లారా..? ప్రభాస్ కి ఉన్న సమస్యల గురించి” అంటూ వేణు స్వామి ప్రభాస్ ఫ్యాన్స్ కు కౌంటర్ వేశారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news