Moviesశేఖర్ మాస్టర్ కు ఆ బడా హీరోయిన్ తో ఎఫైర్ ఉందా..?...

శేఖర్ మాస్టర్ కు ఆ బడా హీరోయిన్ తో ఎఫైర్ ఉందా..? ఇన్నాళ్ల సీక్రేట్ గుట్టు రట్టు చేసేసిన యాంకర్..!

శేఖర్ మాస్టర్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . కొరియోగ్రాఫర్ గా మంచిగా తన పేరుని పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇప్పుడు టాలీవుడ్ లో తెరకెక్కుతున్న బడా బడా సినిమాలకు ఆయన కొరియోగ్రఫీ చేస్తూ ఉండడం గమనార్హం . ఒకపక్క సినిమాలో పాటలకు కొరియోగ్రఫీ చేస్తూనే మరోపక్క బుల్లితెరపై జడ్జిగా వ్యవహరిస్తున్నారు . పలు ఈవెంట్స్ లో కూడా మెరుస్తూ కనిపిస్తున్నారు. రీసెంట్గా ఢీ సీజన్ 17 కు జడ్జ్ గా చేస్తున్నాడు శేఖర్ మాస్టర్ .

అయితే గతంలో కూడా శేఖర్ మాస్టర్ ఢీ సీజన్స్ కు జడ్జిగా చేశారు . కానీ ఎప్పుడు కూడా ఆయన కోపం పడటం మనం చూడలేదు. కానీ ఫస్ట్ టైం ఢీ స్టేజ్ పై ఆయన కోపంతో ఊగిపోయారు . యాంకర్ శివ మనకందరికీ బాగా తెలిసిన వ్యక్తి. ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . ఒకప్పుడు యూట్యూబ్లో వివాదాస్పద వ్యక్తులను ఇంటర్వ్యూ చేసే క్రేజ్ దక్కించుకున్న ఆ తర్వాత బిగ్బాస్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు . తనదైన స్టైల్ లో గేమ్ ఆడి ముందుకు వెళ్ళాడు . ఆ తర్వాత ఇప్పుడు ఢీ సీజన్ 17 షో లో మెరిశాడు .

అతగాడు డాన్స్ చేయడానికి వచ్చాడో లేదా యాంకర్ గా ఉన్న నందుతో కలిసి యాంకరింగ్ చేస్తున్నాడో తెలియదు కానీ శేఖర్ మాస్టర్ తో పరాచకాలు ఆడబోయి కోపం తెప్పించాడు. స్టేజ్ పైకి వచ్చే రాగానే శివ మాట్లాడుతూ ..”మీకు ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉందని ప్రచారం జరిగింది కదా..?” అంటూ ప్రశ్నించాడు. దీంతో సీరియస్ అయిపోయిన శేఖర్ మాస్టర్ ఇతనను ఎవరు రానిచ్చారు..? నువ్వు వెళ్లిపోతావా నన్నే వెళ్లి పోమంటావా..? అంటూ సీరియస్ అయ్యాడు “.

అయితే ఇది ప్రోమో కోసం చేసిందా ..?లేకపోతే నిజంగానే వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా తగాదాలు ఉన్నాయో ..? అన్నది తెలియలేదు . శేఖర్ మాస్టర్ కోపం చూస్తుంటే మాత్రం కూసింత ఘాటుగానే ఇచ్చి పడేసినట్లున్నారు . కాగా శేఖర్ మాస్టర్ తనతో వర్క్ చేసే హీరోయిన్స్ తో కూడా చాలా సరదాగా మూవ్ అవుతారు. గతంలో ఢీ షోలో జడ్జిలుగా చేసిన సదా , శ్రద్ధదాస్, ప్రియమణి, పూర్ణలతో కూడా బాగా డ్యాన్స్ వేసి క్లోజ్ గా మూవ్ అయిపోయారు . దీంతో యాంకర్ శివ అడిగిన క్వశ్చన్ పై ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త కొత్త ఆన్సర్ లు వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news