Moviesఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే బ్యూటీ పేరు మారుమ్రోగిపోతుంది..ఎవరో...

ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే బ్యూటీ పేరు మారుమ్రోగిపోతుంది..ఎవరో గుర్తుపట్టారా..!

ఇక్కడ .. మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అందాల ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతుంది . అలా ఇలా కాదు స్కూల్ కి వెళ్ళే కుర్రాడు దగ్గర నుంచి సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే అంకుల్స్ వరకు అందరూ కూడా ఈ బ్యూటీపై ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం మొదలుపెట్టారు . దీంతో సోషల్ మీడియాలో ఈ అమ్మడి గురించి వార్తలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఇంతకు మీరు ఇక్కడ ఈ పై ఫోటోలో చూస్తున్న చిన్నది ఎవరో గుర్తుపట్టారా..?

ఆమె పేరు రమ్య పసుపులేటి . సోషల్ మీడియాలో పలు రీల్స్ తో బాగా పాపులారిటీ దక్కించుకుంది . మరీ ముఖ్యంగా టిక్ టాక్ సమయంలో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతంగా పెరిగిపోయింది . డిఫరెంట్ డిఫరెంట్ రీల్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న రమ్య పసుపులేటి సినిమాలో కూడా హీరోయిన్గా చేసింది . హుషారులో నటించిన మెప్పించింది . ఆ తర్వాత మైల్స్ ఆఫ్ లవ్ , ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాలో నటించి బాగా మెప్పించింది. ఇప్పుడు మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమాలో కూడా నటిస్తుంది.

కాగా రీసెంట్ గా “మేడం సార్ మేడం అంతే” అనే పాట విడుదల చేశారు . ఈ సాంగ్లో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సూపర్ హిట్ హీరోయిన్స్ ఇంట్రడక్షన్ ను రీ క్రియేట్ చేశారు. దీంతో ఈ వీడియోను బాగా షేర్ చేశారు బన్నీ అభిమానులు. ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ గా మారింది . దీంతో ఎక్కడ చూసినా సరే సోషల్ మీడియాలో ఇప్పుడు రమ్య పసుపులేటి పేరే వైరల్ గా మారిపోయింది . ముందు నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రమ్య పసుపులేటి ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఈ భామకు సంబంధించిన కొన్ని గ్లామరస్ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news