Moviesయూఎస్‌లో స‌లార్ వీరంగం అరాచ‌కం... ఓడియ‌మ్మా అప్పుడే అన్ని కోట్లా...!

యూఎస్‌లో స‌లార్ వీరంగం అరాచ‌కం… ఓడియ‌మ్మా అప్పుడే అన్ని కోట్లా…!

టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ సినిమా స‌లార్‌. ఈ నెల 22న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన స‌లార్ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ వ‌సూళ్ల‌తో అద‌ర‌గొడుతోంది. తొలి రోజే ఏకంగా రు. 180 కోట్ల గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఈ యేడాది బిగ్గెస్ట్ డే వ‌న్ ఓపెన‌ర్‌గా నిలిచింది.

అలాగే ఈ సినిమా టోట‌ల్ ఇండియా వైజ్‌గానే కాకుండా యూఎస్ మార్కెట్లో కూడా ప్ర‌భాస్ స్టామినా ఏంటో చూపిస్తోంది. ఈ యేడాదిక యూఎస్‌లో బిగ్గెస్ట్ ప్రీమియ‌ర్స్ అందుకున్న సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇక యూఎస్‌లో అయితే ఈ వీకెండ్ కంప్లీట్ గా సెన్షేష‌న‌ల్ ర‌న్‌తో దూసుకుపోతోంది. లేటెస్ట్‌గా ఈ సినిమా 4.72 మిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన‌ట్టు తెలుస్తోంది.

ఈ వీకెండ్ నాటికి స‌లార్ చాలా ఈజీగా 6 మిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌డుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌భాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ బాహుబ‌లి 2కు అక్క‌డ 20 మిలియ‌న్ డాల‌ర్ల వ‌సూళ్లు వ‌చ్చాయి. ఇక బాహుబ‌లి 1 7 మిలియ‌న్ డాల‌ర్ల‌తో రెండో స్థానంలో ఉంది. స‌లార్ బాహుబ‌లి 1ను అవ‌లీల‌గా క్రాస్ చేసేస్తోంది. మ‌రి బాహుబ‌లి 2ను క్రాస్ చేస్తుందా ? లేదా ? అన్న‌ది కొద్ది రోజులు ఆగితే కాని తెలియ‌దు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news