Newsఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ సినిమా... అబ్బా ఇంత పెద్ద షాక్...

ఎన్టీఆర్ – ప్ర‌శాంత్ నీల్ సినిమా… అబ్బా ఇంత పెద్ద షాక్ ఇస్తార‌నుకోలేదే…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత వార్ 2కి డేట్లు ఇచ్చాడని టాక్ నడుస్తోంది. అలాగే ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ చేయబోయే సినిమాకు కూడా డేట్లు ఇచ్చాడంటూ మరో ప్రచారం నడుస్తోంది. వార్ 2 సినిమా కంటే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్‌ సినిమా షూటింగ్ ఎప్పుడు ? స్టార్ట్ అవుతుంది అంటూ.. ఎన్టీఆర్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన సలార్ సినిమా ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నాడు. దేవర సినిమా తర్వాత ముందుగా వార్ 2 సినిమా సెట్స్ మీదకు వెళుతుందా.. లేదా ప్రశాంత్‌ నీల్‌ సినిమా సెట్స్ మీదకు వెళుతుందా ? అసలు ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఎప్పుడు ? మొదలవుతుంది.. అన్నది ఎవరికీ క్లారిటీ లేదు. అయితే సలార్ ప్రమోషన్లలో ఉన్న ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చారు.

జనవరి చివరివారం నుంచి ఎన్టీఆర్ సినిమా ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేస్తారట. ఇక 2025 మార్చి నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుందని తెలుస్తోంది. అంటే ఈ లోగా ఎన్టీఆర్ దేవర సినిమాతో పాటు వార్ 2 సినిమా షూటింగ్ కంప్లీట్ చేస్తాడు. ఏమాత్రం టైం ఉన్న దేవర 2 కూడా ఫినిష్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఇక 2025 మార్చి నుంచి ప్రశాంత్‌ నీల్‌తో జాయిన్ అవుతాడు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటించబోతుందంటూ పుకార్లు షికార్లు చేశాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఏదేమైనా 2025 మార్చి వ‌ర‌కు కాని ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌దు. అంటే ఏ 2026లోనో కానీ ఈ సినిమా రిలీజ్ కాద‌ని తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊసురోమంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news