Newsబాల‌య్య - బాబి సినిమాలో మ‌రో సీనియ‌ర్ హీరో... సెంటిమెంట్ ఫాలో...

బాల‌య్య – బాబి సినిమాలో మ‌రో సీనియ‌ర్ హీరో… సెంటిమెంట్ ఫాలో అవుతోన్న న‌ట‌సింహం…!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. దర్శకుడు బాబి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రెండు షెడ్యూలు పూర్తయ్యాయి.. వచ్చే షెడ్యూల్ నుంచి సినీ హీరో జగపతిబాబు కూడా ఈ సినిమా షూటింగ్లో జాయిన్ కాబోతున్నాడు.

బాలయ్య.. జగపతిబాబుపై ఓ భారీ యాక్షన్ సీన్ ను దర్శకుడు బాబి షూట్ చేయబోతున్నారట‌. అందుకోసం ఓ భారీ సెట్ వేస్తున్నారని తెలుస్తోంది. ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ పీట‌ర్ హెయిన్ ఆధ్వ‌ర్యంలో ఈ యాక్ష‌న్ సీన్లు చిత్రీకరిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కు చాలా ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. బాలయ్య ఎప్పుడు కనిపించని సరికొత్త లుక్‌లో కనిపిస్తాడట. ఇక బాలయ్య బ్లాక్ బస్టర్ సినిమా లెజెండ్ లో జగపతిబాబు విలన్ గా కనిపించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది.

ఇప్పుడు కూడా ఆ సెంటిమెంట్ రిపీట్ చేస్తూ జగపతిబాబు ఈ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థ‌మన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో కలర్ ఫోటో హీరోయిన్ చాందిని చౌదరి కీలకపాత్రలో కనిపించబోతుంది. అలాగే బాలయ్యకు జోడిగా మరో సీనియర్ హీరోయిన్ కోసం దర్శకుడు బాబి వేట మొదలుపెట్టారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news