Moviesబిగ్ బాస్ 7 : టెంప్టింగ్ ఆఫర్ తో సూట్ కేస్...

బిగ్ బాస్ 7 : టెంప్టింగ్ ఆఫర్ తో సూట్ కేస్ తీసుకుని బయటకు వచ్చేసిన టాప్ కంటెస్టెంట్.. ఫ్యాన్స్ షాక్..!!

ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడ చూసినా సరే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి సంబంధించిన వార్తలే ఎక్కువగా వినిపిస్తున్నాయి . ఇన్నాళ్లు ఈగర్ గా వెయిట్ చేసిన ఆ ట్రోఫీ ఎవరు అందుకుంటారు అంటూ వెయిట్ చేసిన జనాలకు కొత్త ఉత్సాహం మొదలైంది . ఫైనల్లీ అందరూ అనుకున్నట్లే బిగ్ బాస్ సీజన్ లో సామాన్యుడిగా అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఈసారి ట్రోఫీ అందుకున్నాడు అన్న వార్త బయటకు వచ్చేసింది .

టాప్ 6 లో అర్జున్ అంబాటి మొదటగా ఎలిమినేట్ అవ్వగా టాప్ ఫైవ్ నుంచి ప్రియాంక జై ఎలిమినేట్ అయింది అంటూ తెలుస్తుంది . అంతేకాదు హౌస్ లో టాప్ సిక్స్ గా ఉన్నప్పుడే నాగార్జున 10 లక్షలు సూట్ కేస్ ఆఫర్ ఇస్తాడట. కానీ ఎవరు టెంప్ట్ అవ్వరని.. ఆ తర్వాత టాప్ ఫోర్ లో ఉన్నప్పుడు ఆ అమౌంట్ 15 లక్షలు గా చేస్తూ నాగార్జున క్రేజీ ఆఫర్ ఇస్తారని.. ఆ ఆఫర్ కి టెంప్ట్ అయిపోయిన యావర్ ఆ 15 లక్షల సూట్ కేస్ తీసుకొని బయటకు వచ్చేస్తాడని..

ఆ తర్వాత టాప్ త్రీ లో ఉన్న కంటెస్టెంట్స్ ప్రశాంత్ – అమర్ – శివాజీ నుంచి టాప్ త్రీగా శివాజీ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడని వినిపిస్తుంది. అంతేకాదు టాప్ వన్ గా పల్లవి ప్రశాంత్ రన్నర్ అప్ అమర్దీప్ నిలిచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సూట్ కేస్ తీసుకోవడం ఇదేం కొత్త కాదు ..గత సీజన్లో కూడా ఇలాగే జరిగింది. గతంలో సోహెల్ ఈ కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టాడు. ఇలా బిగ్ బాస్ హౌస్ నుంచి సూట్ కేసు తీసుకొని బయటికి వచ్చేసి ఎన్ని ఆఫర్స్ అందుకున్నాడో అందరికీ తెలిసిందే..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news