Moviesభారీ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన బన్నీ.. పుష్ప రాజ్ ...

భారీ ఆఫర్ ని రిజెక్ట్ చేసిన బన్నీ.. పుష్ప రాజ్ క్యారెక్టర్ నర నరాల్లో ఎక్కేసిన్నట్లు ఉందే..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా కానీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు చెప్పగానే వచ్చే అరుపులు కేకలు ఊపు ఓ రకంగా ఉంటుంది . మరీ ముఖ్యంగా బన్నీ కెరియర్ గురించి చెప్పుకోవాలి అంటే పుష్ప సినిమా ముందు పుష్ప సినిమా తర్వాత అన్న రేంజ్ లో మారిపోయింది . పుష్ప సినిమా కన్నా ముందు బన్ని చాలా సినిమాలో నటించాడు . హిట్లు అందుకున్నాడు లాభాలు తెచ్చుకున్నాడు.

అయినా కానీ పుష్ప సినిమా మాత్రం ఆయన కెరియర్లో స్పెషల్ గా నిలిచిపోయింది . ఈ సినిమాతో ఏకంగా ఉత్తమ జాతియ నటుడి అవార్డు కూడా అందుకున్నాడు . ఆ తర్వాత బన్నీ క్రేజ్ మరింత మారిపోయింది . దీంతో పలు బ్రాండెడ్ ప్రొడక్ట్స్ వాళ్ళు బన్నీతో యాడ్ షూట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . ఈ క్రమంలోనే బన్నీ వద్దకు వచ్చి ఓ స్మోకింగ్ కంపెనీ వాళ్లు భారీ ఆఫర్ ఇచ్చారట.

తమ ప్రాజెక్టును ప్రమోట్ చేస్తే ఏకంగా 15 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తామంటూ చెప్పుకొచ్చారట . అయితే బన్నీ మాత్రం వెంటనే ఆఫర్ రిజెక్ట్ చేశారట. కొన్ని కోట్ల ఆఫర్ ఇచ్చిన ప్రజలకి చెడు చేసే ప్రొడక్ట్స్ నేను ప్రమోట్ చేయను అంటూ నిర్మొహమాటంగా చెప్పుకు వచ్చారట . ఈ విషయం తెలుసుకున్న బన్నీ ఫ్యాన్స్ ఫుల్ సంతోష పడిపోతున్నారు .అందరి హీరోలు గా ప్రోడక్ట్ రెమ్యూనరేషన్ చూసే హీరో కాదు మా బన్నీ అంటూ చెప్పుకొస్తున్నారు. మరికొందరు బన్ని కి పుష్ప రాజ్ క్యారెక్టర్ నర నరాల్లోకి ఎక్కేసింది అంటూ చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news