Moviesచిరంజీవి ఇంద్ర సినిమాతో మెహ్రీన్ కి ఉన్న క్రేజీ సంబంధం ఏంటో...

చిరంజీవి ఇంద్ర సినిమాతో మెహ్రీన్ కి ఉన్న క్రేజీ సంబంధం ఏంటో తెలుసా..? అందుకే హీరోలు ఎగబడిపోతున్నారా..?

ఇంద్ర ఈ సినిమా పేరు చెప్తే ఆటోమేటిక్గా ఊగిపోయే జనాలు ఎంతోమంది . మెగాస్టార్ కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించిన ఈ సినిమా ఎవర్గ్రీన్ టాప్ ట్రెండింగ్ లిస్టులో ఎప్పుడు మొదటి స్థానంలోనే ఉంటుంది . ఈ సినిమాకి ఒక్కటంటే ఒక్క నెగిటివ్ రివ్యూ రాలేదు . ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా రాలేదు. అంతెందుకు ఇప్పటికీ ఈ సినిమాను రీమేక్ చేయడానికి చాలామంది హీరోలు ట్రై చేస్తున్న అంతటి స్థానాన్ని అందుకోలేమంటూ వెనకడుగు వేస్తున్నారు.

అలా ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్టర్ మూవీ గా నిలిచింది ఈ మూవీ. ఈ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . కాగా ఈ సినిమాతో హీరోయిన్ మెహ్రీన్ కు ఉన్న సంబంధం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఇంద్ర సినిమాను కోలీవుడ్లో లో వాడుకుంటున్నారు. ఈ సినిమా టైటిల్ ద్వారానే మెహ్రిన్ కోలీవుడ్లోకి రియంట్రీ ఇవ్వబోతుంది . అది కూడా రజనీకాంత్ తో జైలర్ మూవీలో నటించిన వసంత రవితో ..ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .

జైలర్ తర్వాత ఓ డిఫరెంట్ మూవీకి రవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . తెలుగు – తమిళ భాషలలో బై లింగువల్ గా రూపొందుతున్న ఈ సినిమాకు చిరంజీవి బ్లాక్ బస్టర్ మూవీ ఇంద్ర టైటిల్ ని ఫిక్స్ చేశారట . అంతేకాదు టైటిల్ మూవీ తో పాటు ఫస్ట్ లుక్ కూడా చాలా ఎంటర్టైన్ గా ఆకట్టుకుంటుంది . ఈ పోస్టర్లో సగం ముఖం క్లాస్ లుక్ లో మరో సగం ముఖం గడ్డంతో రఫ్ లుక్ లో కనిపించాడు వసంత రవి. ఇంద్ర సినిమాకు శబరిష్ నంద దర్శకత్వం వహిస్తున్నాడు. మెహ్రీన్ హీరోయిన్గా నటిస్తుంది . ధనుష్ పటాస్ అనంతరం దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఇంద్రతో రీ ఎంట్రీ ఇస్తుంది మెరీన్, ఈ సినిమాలో అనేక సురేంద్రన్ – సునీల్ కీలకపాత్రలో కనిపించబోతున్నారు . ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news