Moviesఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ..తల్లి కాబోతున్న మరో స్టార్ హీరోయిన్.....

ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ..తల్లి కాబోతున్న మరో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలిస్తే ఎగిరి గంత్తేస్తారు..!?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీస్ ఏ విషయాన్ని అయినా సీక్రెట్ గా దాచడానికి ఇష్టపడుతున్నారు. అది లవ్ – డేటింగ్ – నిశ్చితార్థం- పెళ్లి -ప్రెగ్నెన్సీ ఏదైనా సరే రీజన్ ఏంటో తెలియడం లేదు . అంతా అయిపోయాక అఫీషియల్గా ఆ విషయాన్ని బయట పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . తాజాగా సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఒక స్టార్ హీరోయిన్ కి సంబంధించిన మ్యాటర్ బాగా వైరల్ గా మారింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ దీపికా పదుకొనే తల్లి కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే .

ఆమె తల్లి కాబోతుంది అంటూ గత మూడు నెలలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఫైనల్లీ ఆమె తల్లి కాబోతున్న విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించింది . ఇప్పుడు ఇదే లిస్టులోకి చేరబోతుంది మరో స్టార్ హీరోయిన్ అంటూ ప్రచారం జరుగుతుంది. అందాల ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ తల్లి కాబోతుందట . ఈ విషయాన్ని టాప్ సీక్రెట్గా ఉంచింది అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ గా మారింది . బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న కత్రినా ..ఫ్యామిలీ లైఫ్ ను బాగా ఎంజాయ్ చేస్తుంది.

అయితే అభిమానులు ఎక్స్పెక్ట్ చేస్తున్న గుడ్ న్యూస్ మాత్రం ఇప్పటికీ చెప్పలేదు . కాగా రీసెంట్ గా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ న్యూస్ బాగా వైరల్ గా మారింది . తాజాగా ఓ ప్రముఖ స్టార్ సెలబ్రిటీ ఇచ్చిన పార్టీకి కత్రినా కైఫ్ రాలేదు. అంతేకాదు ఆమె ఆయనకి జాన్ జిగిడి దోస్త్.. అంతకుమించి.. అయితే ఎందుకు ఆయన ఇచ్చిన పార్టీకి కత్రిన రాలేదు అంటే .. మాత్రం ఆమె బేబీ బంప్ బయట పడుతుంది అన్న భయంతోనే అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. దీంతో కత్రినా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మా హీరోయిన్ తల్లి కాబోతుందా..? అంటూ కంగ్రాట్యులేషన్స్ అంటూ విష్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news