Newsప‌వ‌న్ ' ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ' సినిమాపై బాల‌య్య సూప‌ర్ సెటైర్లు...!

ప‌వ‌న్ ‘ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ ‘ సినిమాపై బాల‌య్య సూప‌ర్ సెటైర్లు…!

నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్‌స్టాప‌బుల్‌ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజా సీజన్లో అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 22న స్ట్రీమింగ్ అయ్యే ఎపిసోడ్లో హీరోయిన్ శ్రేయ, అలనాటి నటి హీరోయిన్‌ సుహాసిని, దర్శకులు హరీష్ శంకర్, మ‌రో సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు జయంత్ సీ పరంజి సందడి చేయనున్నారు. ఈ షో కూడా బాలయ్య స్టైల్ సెటైర్లు. పంచ్‌లు. జోకులతో సరదాగా సాగిపోతుందని తాజాగా రిలీజ్ అయిన ప్రోమో చూస్తే అర్థమవుతుంది.

సుహాసిని గురించి బాలయ్య మాట్లాడుతూ సుహాసినిది నాది జన్మజన్మల బంధం.. శ్రీయ‌ది.. నాది ఈ మిలీనియం బంధం అని అనడంతో ఒక్కసారిగా నవ్వులు పూసాయి. ఆ తర్వాత బాలకృష్ణ మాట్లాడుతూ నేను కావాలనే మీ ముగ్గురుతో మాట్లాడుతున్నాను. హరీష్‌ను ఎవాయిడ్ చేస్తున్నా.. హరీష్‌కు నాకు కొన్ని పాత కక్షలు ఉన్నాయి అన్నారు. ఇందుకు హరీష్ నేను బ్రో అని అన్నాను అందుకే అన్నారంటే.. ఏంటి బ్రో.. స్టూడియో తలుపులు మూసేయండి అని బాలకృష్ణ సరదాగా ఆట పట్టించారు.

ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో, హరీష్ శంకర్ ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. పవన్ రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండడంతో ఈ సినిమా షూటింగ్ ముందుకు సాగటం లేదు. ఈ విషయాన్ని బాలయ్య షోలో పరోక్షంగా ప్రస్తావించారు. ఏమిటి వారాహి హాలీడేస్‌నా ఫ్రీగా ఉన్నావు అని సరదాగా ఆటపట్టించారు. దీంతో దర్శ‌కుడు హరీష్‌ శంకర్‌కు ఏం చెప్పాలో తెలియక ముఖం దాచుకున్నాడు. ఆ తర్వాత ఈ గ్యాప్ మట్టుకు వెకేషన్.. సినిమా రిలీజ్ అయ్యాక సెన్షేష‌న్ అని చెప్పాడు.

ఇక సుహాసిని మాట్లాడుతూ నేను ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది బాలయ్య‌తోనే అని తెలిపారు.. ఇక సుహాసిని ఈ షోలో వచ్చిన గెస్ట్ లలో ఎవరు మీరు ? అనుకున్న విధంగా మాట్లాడలేదనిపించింది అని ప్రశ్నిస్తే.. ఇందుకు బాలయ్య ఒకతను ఇలాగే చేశాడని అన్నారు.. వెంటనే హరీష్ శంకర్ ఎవరు అలా ?చేశారు అని అడగగా.. వెంటనే బాలయ్య మీ వాడే అంటూ పవన్ కళ్యాణ్ గురించి చెప్పారు. ఎవ‌రి విష‌యంలో ఎక్కువగా మాట్లాడుతున్నాడు అసలు ఆపట్లేదు అని అనిపించింద‌ని దర్శకుడు జయంత్‌ ప్రశ్నిస్తే ఇంకెవరు రవితేజ అని బాలయ్య తెలిపారు. ఏది ఏమైనా ఈ ఎపిసోడ్ తో కావలసినంత ఎంజాయ్ చేసేందుకు మనం రెడీగా ఉండొచ్చు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news