Newsర‌వితేజ ' ఈగిల్‌ ' కు అదే ప్ల‌స్ కానుంగా... మ‌హేష్‌కు...

ర‌వితేజ ‘ ఈగిల్‌ ‘ కు అదే ప్ల‌స్ కానుంగా… మ‌హేష్‌కు షాక్ త‌ప్ప‌దా…!

టాలీవుడ్ మాస్ మహారాజు రవితేజ హీరోగా యువ దర్శ‌కుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ సినిమా ఈగిల్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ఈగిల్‌ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ ఆడు మచ్చా అందరిని ఆకట్టుకుని సినిమాపై అంచనాలు పెంచేసింది. దసరాకు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అంచనాలు అందుకో లేకపోయినా రవితేజ.. ఈగిల్ సినిమాతో సూపర్ హిట్ కొడతానన్న కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు.

ఈ సినిమాలో రవితేజ షూటర్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో నవదీప్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమా రన్ టైం గురించి అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది. ఈగిల్ రన్ టైం కేవలం రెండు గంటల పది నిమిషాలు ఉన్నట్టు తెలుస్తోంది. అంటే ఈ సినిమా రన్ టైమ్ 130 నిమిషాలు. ఇది సినిమాకు చాలా ప్లస్ అవుతుంది. సినిమాను చాలా క్రిస్పీగా కట్ చేశారని అదిరిపోయిందని అంటున్నారు.

ఈగిల్ సినిమాకు మంచి టాక్ వస్తే అటువైపు మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న గుంటూరు కారం సినిమాకు గట్టి పోటీ తప్పదని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈగిల్‌కు ర‌న్ టైం చాలా ప్ల‌స్ కానుంది. సినిమాకు మంచి టాక్ వ‌స్తే ఎక్కువ మంది సినీ అభిమానులు ఈగిల్‌ను చూసేందుకే ఇష్ట‌ప‌డ‌తారు.

ఏది ఏమైనా అటు వెంకటేష్ సైంధవ్‌ సినిమా, హనుమాన్ కూడా సంక్రాంతి రేసులో ఉండడంతో గుంటూరు కారంకు గట్టి పోటీ తప్పేలా లేదు. సినిమాకు యునానిమస్‌గా సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప ఇన్ని సినిమాల మధ్యలో మహేష్ ఎంతవరకు బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతాడు అన్నది సందేహంగా ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news