News"అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి" సినిమాకి సీక్వెల్ వచ్చేస్తుందోచ్.. హీరో...

“అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి” సినిమాకి సీక్వెల్ వచ్చేస్తుందోచ్.. హీరో హీరోయిన్లు ఎవరంటే..మెంటల్ ఎక్కిపోవాల్సిందే..!!

“అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి “.. ఈ సినిమా పేరు చెప్తే ఇప్పటి జనాలకి ఈ జనరేషన్ కి పెద్దగా బుర్రకక్కదేమో.. గాని ఒకప్పటి జనరేషన్ అయితే మాత్రం ఓ రేంజ్ లో ఊగిపోతారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా అందాల ముద్దుగుమ్మ హాట్ హీరోయిన్ అసిన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆల్ టైం సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది .

ఈ సినిమా అప్పట్లో ఎన్ని ప్రభంజనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూరి జగన్నాథ్ తనదైన స్టైల్ లో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఆ తర్వాత ఈ చిత్రాన్ని ఎం కుమారన్ సన్ ఆఫ్ మహాలక్ష్మి పేరుతో దర్శకుడు మోహన్ రాజా తమిళంలో రీమేక్ చేసి హిట్టు అందుకున్నాడు. జయం రవి హీరోగా నటించిన పాత్రలో అసిన్ హీరోయిన్ గా చేసింది. జయ సుధ పాత్రలో నదియా చించేసింది.

సినిమా రిలీజ్ అయిన ఇన్నాళ్లకు అంటే దాదాపు 15 ఏళ్లకు ఈ సినిమాకు సంబంధించిన సీక్వెల్ తీయాలని డిసైడ్ అయ్యారు డైరెక్టర్ . ఈ విషయం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మోహన్ రాజా వెల్లడించారు . ఈ సినిమాకు సీక్వెల్ కచ్చితంగా వస్తుంది అని సినిమా కాన్సెప్ట్ మొత్తం పూర్తయిపోయింది అని .. ఈ సినిమాలో హీరోగా జయం రవినే నటిస్తున్నాడు అని హీరోయిన్ ఇంకా ఎవరు అనేది డిసైడ్ అవ్వలేదు అని.. నదియా రోల్ మాత్రం ఈ సినిమాలో ఉండదు అని చెప్పుకొచ్చాడు . దీంతో ఈ సినిమాకి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. అసిన్ లాంటి లుక్స్ కావాలి అంటే కచ్చితంగా రష్మిక మందన్నానే బాగుంటుంది అంటున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news