Newsసోషల్ మీడియాని షేక్ చేస్తున్న రష్మిక ఫేక్ (వీడియో).. మరీ...

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న రష్మిక ఫేక్ (వీడియో).. మరీ ఇంతలా మార్ఫింగ్ చేస్తారా..?

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక .. ఏది నిజం ఏది అబద్దం అని తెలుసుకోవడానికి తలప్రాణం తోకకు వస్తుంది . మరీ ముఖ్యంగా కొంతమంది ఆకతాయిలు స్టార్ సెలబ్రిటీస్ ని వాళ్ళ ఫొటోస్ ని మార్ఫ్ చేస్తూ సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు . కాగా రీసెంట్గా నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా.. ఫేక్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేసి పడేస్తుంది .

తాజాగా రన్బీర్ సరసన యానిమల్ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . రష్మిక డీప్ నెక్ బ్లాక్ డ్రెస్ లో లిఫ్ట్ లోకి వచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో రష్మిక టూ హాట్ ఎక్స్పోజింగ్ చేసినట్లు కనిపిస్తుంది . దీనితో అభిమానులు షాక్ అయిపోయారు. ” ఏంటి మా రష్మికనేనా ఇది అంటూ లబోదిబో మన్నారు”.

అయితే అసలు విషయంకి వస్తే ఇది ఆమెది కాదు . ఇది ఒరిజినల్ వీడియో జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కి సంబంధించినది . ఆమె వీడియోని ఎవరో మార్ఫ్ చేసి రష్మిక ఫేస్ తో ఇలా క్రియేట్ చేశారు . దీంతో పలువురు స్టార్ సెలబ్రిటీస్ కూడా ఈ మార్ఫింగ్ పై మండిపడుతున్నారు . బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ కూడా స్పందిస్తూ “ఇలాంటి వాటిపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలి “అంటూ కోరారు . అయితే ఇంకా ఈ వీడియో పై రష్మిక స్పందించకపోవడం గమనార్హం..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news