Newsజబర్ధస్త్ యాంకర్ మారిపోయిందోచ్.. కొత్త హోస్ట్ ఎవరో తెలుసా.. అనసూయ-రష్మి-సౌమ్య నే...

జబర్ధస్త్ యాంకర్ మారిపోయిందోచ్.. కొత్త హోస్ట్ ఎవరో తెలుసా.. అనసూయ-రష్మి-సౌమ్య నే మించిపోయే ఫిగర్..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో బుల్లితెరపై వైరల్ గా మారింది . జబర్దస్త్ షో ఎంత పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బడా బడా హీరోలు కూడా తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి జబర్దస్త్ షో కి వచ్చారు అంటే ఆ షో స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ షోలో కంటెస్టెంట్స్.. కమెడియన్స్ ..జడ్జెస్ ఎంత పాపులారిటీ దక్కించుకున్నారో అదేవిధంగా యాంకర్లు కూడా పాపులారిటీ దక్కించుకున్నారు .

అయితే యాంకర్ అనసూయ ఈ షో నుంచి తప్పుకోవడంతో ఆమె ప్లేస్ లోకి యాంకర్ సౌమ్య వచ్చి అలరించిన విషయం తెలిసిందే . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా సౌమ్య కూడా యాంకర్ పోస్ట్ నుంచి తప్పుకుంది. ఈ క్రమంలోనే జబర్దస్త్ కొత్త యాంకర్ గా సిరి ను అపాయింట్ చేశారు మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ . దీనికి సంబంధించిన ప్రోమో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది .

సౌమ్యస్థానంలో సిరిని చూడగానే అక్కడ జనాలు షాక్ అయిపోయారు . అంతేకాదు సిరి ఈ మధ్యకాలంలో బాగా పాపులారిటీ దక్కించుకుంది . జవాన్ సినిమాలో కూడా నటించింది . అందుకే ఆమెను ఈ షో కి హోస్టుగా తీసుకొచ్చారు అంటూ ప్రచారం జరుగుతుంది . అయితే సౌమ్యను ఉన్నట్టుండి యాంకర్ స్థానం నుంచి తప్పించడం వెనక వేరే అర్థం ఏదైనా ఉందా ..? లేకపోతే ఆమె వ్యక్తిగత కారణాలు చేత కొన్ని రోజులు లీవ్ తీసుకుందా ..? అనేది సస్పెన్స్ మధ్య ఆగిపోయింది. అయితే రావడం రావడం జబర్దస్త్ కమెడియన్స్ కొత్త యాంకర్ నెల రోజులే అంటూ కామెంట్ చేశారు..దీనితో సిరి ముఖం వాడిపోయినంత పని అయింది . తాజాగా విడుదలైన ప్రోమో వైరల్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news