Newsవరుణ్-లావణ్య పెళ్లి వీడియోని నెట్ ఫ్లిక్స్ కి అమ్మేసిన నాగబాబు.. మొత్తంగా...

వరుణ్-లావణ్య పెళ్లి వీడియోని నెట్ ఫ్లిక్స్ కి అమ్మేసిన నాగబాబు.. మొత్తంగా ఎన్ని రూ.కోట్లు లాభమో తెలుసా?

ఈ మధ్యకాలంలో ఇది ఓ బాగా ట్రెండ్ గా మారిపోయింది . టాప్ సెలబ్రిటీస్ తమ పెళ్లికి సంబంధించిన వీడియోస్ ను కోట్లకు కోట్లు అమ్మేస్తున్నారు . నయనతార తన పెళ్లికి సంబంధించిన పూర్తి హక్కులను నెట్ ఫ్లిక్స్ కి ఎన్ని కోట్లకు అమ్మిందో మనకు తెలిసిందే. రీసెంట్గా అదే లిస్టులోకి వచ్చాడు వరుణ్ తేజ్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వివాహం ఇటలీలో ఘనంగా జరిగింది .

హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెడలో మూడు ముళ్ళు వేశాడు వరుణ్ తేజ్ . అయితే వీళ్ళ పెళ్లికి సంబంధించిన పిక్చర్స్ రిలీజ్ చేస్తున్నారే కానీ ఎక్కడ వీళ్ళ పెళ్లికి సంబంధించిన వీడియో ని రిలీజ్ చేయడం లేదు. నాగబాబు తన కూతురు నిహారిక పెళ్లిని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశారు . అదేవిధంగా వరుణ్ పెళ్లి ని కూడా పోస్ట్ చేస్తాడేమో అంటూ వెయిట్ చేస్తున్నారు అభిమానులు.

కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం నాగబాబు తన కొడుకు పెళ్లికి సంబంధించిన వీడియోను నెట్ ఫ్లిక్స్ కు భారీ ధరకు అమ్మేసారట. అంతేకాదు నెట్ ఫ్లిక్స్ కూడా వీరి పెళ్లిని భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది . దాదాపు 27 కోట్లకు నాగబాబు పెళ్లి వీడియోని అమ్మేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . ఈ విధంగా చూసుకుంటే వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి వీడియో చూడాలి అంటే నెట్ ఫ్లిక్స్ ప్రచారం చేసేవరకు ఎదురుచూడాల్సిందేమో .. ? చూద్దాం దీనిపై మెగా ఫ్యామిలీ ఏ విధంగా స్పందిస్తుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news