Newsనాగచైతన్య-లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా...

నాగచైతన్య-లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఇదే.. జస్ట్ మిస్..!!

మెగా కోడలు లావణ్య త్రిపాఠికికి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా ఎప్పుడైతే వరుణ్ తో ప్రేమాయణం నడుపుతుంది ..మెగా ఇంటికి కోడలు కాబోతుంది అని తెలిసిందో అప్పటి నుంచే మీడియా ఆమెపై స్పెషల్ ఫోకస్ చేసింది . జనాలు కూడా ఆమెకు సంబంధించిన వార్తలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే లావణ్య త్రిపాఠి నాగచైతన్య కాంబోలో మిస్సయిన సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ వైరల్ అవుతున్నాయి .

లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో మంచి హీరోయిన్గా పాపులారిటీ దక్కించుకుంది . ఆ తర్వాత పలు సినిమాలు చేసిన పెద్దగా క్రేజ్ లభించలేకపోయింది . అయితే లావణ్య త్రిపాఠి తన వద్దకు వచ్చిన పలు ఆఫర్స్ ను రిజెక్ట్ చేసింది . వాటిల్లో ఒకటే నాగచైతన్య సమంత హీరో హీరోయిన్లుగా నటించిన మజిలీ .

ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్ కూడా నటించింది . అయితే శివ నిర్మాణ ఈ పాత్ర కోసం ముందుగా లావణ్య త్రిపాఠిను అప్రోచ్ అయ్యారట. కానీ లావణ్య ఆ పాత్ర నచ్చక రిజెక్ట్ చేసింది .అంతేకాదు బంగార్రాజు సినిమాలో నాగచైతన్యకు తల్లి పాత్రగా కూడా ఆఫర్ వచ్చింది . అయితే ఆఫర్ నచ్చక లావణ్య త్రిపాఠి ఈ సినిమాను కూడా రిజెక్ట్ చేసింది . అలా వీళ్ళ కాంబోలో రావాల్సిన రెండు సినిమాలు మిస్ అయ్యాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news