Moviesప‌క్కా బ్లాక్ బ‌స్ట‌ర్ రేంజ్ ' టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ' ట్రైల‌ర్...

ప‌క్కా బ్లాక్ బ‌స్ట‌ర్ రేంజ్ ‘ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు ‘ ట్రైల‌ర్ ( వీడియో)

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా బాలీవుడ్ హీరోయిన్ నపూర్ సనన్‌ హీరోయిన్గా దర్శకుడు వంశీ తెర‌కెక్కిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాపై గట్టిగా ఉన్న‌ అంచ‌నాల‌కు అనుగుణంగా మేకర్స్ కూడా ఎక్కడా తగ్గకుండా సినిమాపై పక్కా ప్లానింగ్ తో వస్తున్నారు. ఇక ఈ సినిమా దసరా కనుక అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుందా ? అంటూ ఎంతో ఉత్కంఠతో వెయిటింగ్ లో ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం ముంబైలో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్. ట్రైలర్ మాత్రం కచ్చితంగా నెక్ట్స్‌ లెవెల్ లో ఉందని చెప్పాలి. గతంలో వచ్చిన టీజర్ మించి అదిరిపోయే రేజ్‌తో ట్రైలర్ ఉంది. సినిమాలో ఈ అంశం తక్కువ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

ఇది ఎక్కువ.. ఇది తక్కువ అని చెప్పేందుకు వీలు లేకుండా అన్ని సమపాళ్లలో ఉన్నాయి. కచ్చితంగా ష్యూర్ షాట్‌గా హిట్‌ కొట్టబోతున్నాం అన్న రేంజ్ లో విజువల్స్ ఉన్నాయి. యాక్షన్, ఎమోషన్, లవ్, డైలాగులు అన్ని చాలా గ్రాండ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. సినిమాటోగ్రఫీ ట్రైలర్ కు ప్రాణం పోశాయి. చాలా భారీతనం కనిపించింది. ఓవరాల్ గా ట్రైలర్ చూస్తుంటే టైగర్ నాగేశ్వరరావు ఒక పైసా వసూల్ సినిమాగా అనిపిస్తుంది.

దసరాకు కంప్లీట్ ప్యాకేజ్‌ సినిమాగా టైగర్ నాగేశ్వరరావు థియేటర్లోకి దిగుతుందని క్లారిటీ ఇచ్చేశారు. ఏది ఏమైనా టైగర్ నాగేశ్వరరావు సినిమాతో బాక్సాఫీస్ దగ్గర గట్టిగా గర్జించబోతున్నాను అంటూ రవితేజ హింట్‌ ఇచ్చేశాడు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కొత్త దర్శకుడు వంశీ దర్శకత్వం వహిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news