Newsశ్రీలీల - ర‌ష్మిక మ‌ధ్య‌లో న‌లుగుతోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌... నాకు ఆమే...

శ్రీలీల – ర‌ష్మిక మ‌ధ్య‌లో న‌లుగుతోన్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌… నాకు ఆమే కావాలంటూ పంతం..!

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత ఏడాది లైగ‌ర్ లాంటి డిజాస్టర్ సినిమాలో నటించి తన అభిమానులను బాగా నిరాశపరిచాడు. ఈ ఏడాది సమంతతో కలిసి నటించిన ఖుషి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. సెప్టెంబరు 1 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖుషి అంచనాలు అందుకోలేకపోయింది. సినిమా బాగున్నా సమంత – విజయ్ దేవరకొండ లాంటి క్రేజీ కాంబినేషన్లో వచ్చి ఆ రేంజ్ కు తగినట్టుగా హిట్ అవ్వలేదు.

ప్రస్తుతం విజయ్ గౌతమ్ తిన్న‌నూరి డైరెక్షన్లో VD 12వ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో సరైన క్లారిటీ లేదు. రకరకాల ప్రచారం జరుగుతుంది. ముందుగా శ్రీలీల‌ను హీరోయిన్ అనుకున్నారు. అయితే విజయ్ దేవరకొండ చక్రం తిప్పి ఆమె ప్లేస్ లో రష్మికను తీసుకునేలా చేశారన్న పుకార్లు వ్యాపించాయి.

ఇప్పుడు నిర్మాత నాగ వంశీ మరో ప్రకటన చేశారు. VD 12 లో శ్రీ లీల‌ మాత్రమే హీరోయిన్గా నటిస్తుందని.. ఇందులో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు. దీంతో విజయ్ మనసు రష్మిక మీద ఉంటే.. నిర్మాత నాగ వంశీ మనసు శ్రీలీల‌ మీద ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక విజయ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు.

దాదాపు 100 కోట్ల రూపాయలతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు రాక్ స్టార్ అనిరుధ్‌ రవిచంద్ర సంగీతం అందిస్తున్నారు. వ‌చ్చే యేడాది ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news