Newsమహేశ్-చరణ్-ప్రభాస్-బన్ని..వీళ్లల్లో NTR ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా..!

మహేశ్-చరణ్-ప్రభాస్-బన్ని..వీళ్లల్లో NTR ఫేవరేట్ హీరో ఎవరో తెలుసా..!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ అయినా తమకంటూ ఓ టేస్ట్ ఉంటుంది.. తమకంటూ ఓ ఫేవరెట్ హీరో హీరోయిన్ అంటూ ఉంటుంటారు . ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్న ఎన్టీఆర్ కి సైతం అలాంటి కొన్ని టేస్టులు ఉన్నాయి . అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ ఎక్కడ కూడా నాకు పలానా హీరో అంటే ఇష్టం అంటూ చెప్పలేదు . వివిధ సందర్భాలలో వాళ్లలోని క్వాలిటీ నచ్చుతుంది అంటూ చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ కి జాన్ జిగిడి దోస్తులైన మహేష్ బాబు – బన్నీ- చరణ్ – ప్రభాస్ ఈ నలుగురిలో ఆయనకు బాగా నచ్చిన క్వాలిటీస్ ఏంటి అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకు వచ్చాడు .

మహేష్ బాబు: మొదటి నుంచి మహేష్ బాబును బ్రదర్ల ఫీల్ అవుతాడట ఎన్టీఆర్ . అంతేకాదు ఆయనలోని కూల్ నెస్ .. ఆ హెల్త్ డైట్ ఫాలోయింగ్ పాటించడానికి బాగా ఇష్టపడతారట. కానీ ఎన్టీఆర్ రెండు రోజులు డైట్ చేసి మూడోరోజు మళ్లీ నార్మల్ డైట్ కి వచ్చేస్తారట .

బన్నీ : తారక్ ముద్దుగా బన్నీ ని బావ అంటూ పిలుస్తాడు. చాలా చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ . బన్నీలోని డాన్స్ అంటే తారక్ విపరీతమైన ఇష్టమట. ఆయనలాగా బాడీని స్ప్రింగ్ లా తిప్పేస్తూ డాన్స్ చేయాలి అని చాలాసార్లు ట్రై చేశారట .

ప్రభాస్ : ప్రభాస్ డైలాగ్ డెలివరీ అంటే తారక్ కి చాలా ఇష్టమట . డైలాగ్స్ ను తన బాడీ మోడ్యులేషన్స్ లో అప్లికేబుల్ చేసుకొని ఒకే రిథమ్లా లేకుండా సీన్ కి తగ్గట్టు డైలాగ్స్ డెలివరీ చేస్తూ ఉంటాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు .

చరణ్ : దేవుడిచ్చిన బ్రదర్ అంటూ చెప్పుకొచ్చే తారక్ చరణ్ లోని అమాయకత్వం-అల్లరితనం-సైలెన్స్ అంటే చాలా ఇష్టమట . చరణ్ ఆ పని చేయాలనుకుంటాడు కానీ ఆ పని చేయడు . పక్క వాళ్ళ దగ్గర చేయిస్తాడు . అలాంటి మ్యాజిక్ చరణ్ లో ఉంది అంటూ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెప్పుకొచ్చారు . అలా ఈ నలుగురిలో వివిధ క్వాలిటీలు ద్వారా ఎన్టీఆర్ మనసు దోచేశారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news