Moviesదేవర - పుష్ప2 రికార్డులు బ్రేక్ చేయాలి అంటే.. ఆ సినిమా...

దేవర – పుష్ప2 రికార్డులు బ్రేక్ చేయాలి అంటే.. ఆ సినిమా రావాల్సిందే .. ఆ హీరోకి మాత్రమే ఆ సత్తా ఉందా..?

ప్రజెంట్ .. ఇప్పుడు సినీ లవర్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర .. పుష్ప2. ఈ సినిమాలపై జనాలు ఏ విధంగా హై రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మనకు తెలిసిందే. పుష్ప2 సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అల్లు అర్జున్ . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. అదేవిధంగా ఈ సినిమా ఎలాంటి హ్యూజ్ రికార్డ్స్ క్రియేట్ చేయబోతుందో అంటూ కళ్ళల్లో వత్తులు వేసుకొని మరీ వెయిట్ చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు .

కాగా ఈ సినిమా రికార్డ్స్ బ్రేక్ చేయాలి అంటే అది ఎన్టీఆర్ కి సాధ్యమవుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా దేవర దసరా కానుకగా అక్టోబర్ 10 వ తేదీ రిలీజ్ కాబోతుంది . పుష్ప 2 రికార్డ్స్ బ్రేక్ చేయాలి అంటే కచ్చితంగా ఈ సినిమాకి సాధ్యమవుతుంది . అయితే ఈ రెండు సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేయాలి అంటే మాత్రం అది సందీప్ రెడ్డి గంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించే సినిమా అయ్యే ఉండాలి అంటున్నారు జనాలు.

మనకు తెలిసిందే పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కే సినిమాల్లోనే నటిస్తున్నాడు ప్రభాస్. త్వరలోనే కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే ఆ తరువాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలో నటించడానికి సర్వం సిద్ధం చేసుకున్నాడు ప్రభాస్ . ఆ సినిమాకి మాత్రమే ఆ సత్తా ఉంటుంది అని ..స్పిరిట్ సినిమా మాత్రమే ఎలాంటి ఒక క్రేజీ రికార్డ్స్ ని అయినా బ్రేక్ చేస్తుంది అని చెప్పుకొస్తున్నారు . సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఇదే వార్త వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news